ఇది పాట కాదు… పెయింటింగ్…

(సలీమ్ బాషా)
ఇది పాట కాదు. కాన్వాస్ పై మహమ్మద్ రఫీ, ఓపీ నయ్యర్,అంజాన్ కలిసి చిత్రీకరించిన ఒక అద్భుతమైన, అందమైన చిత్రం. ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వంలో “బహారే ఫిర్ భి అయేంగి”(1966) సినిమాలో ఉన్న పాట ఇది. ఎండాకాలపు రాత్రులు, వర్షాకాలపు సాయంత్రాలు, చలికాలపు మధ్యాహ్నాలు, ఏ కాలమైనా సరే ఈ పాట వినడంలో మజానే వేరు. రఫీ పాడిన ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ ఎంత బాగుందో చూడొచ్చు. తనూజా ఎక్స్ప్రెషన్స్, వాటిని మ్యాచ్ చేస్తూ అప్పటి సీనియర్ నటి మాలా సిన్హా హావభావాలు చూస్తూ ఉండి పోతాం.(స్వచ్ఛంగా అరవిరిసిన వారి అందం గురించి చెప్పాలా!) మధ్యాహ్నం పూట ఈ పాట వింటే అలా మత్తుగా కునుకు పడుతుంది. సాయంత్రం ఈ పాట వింటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. రాత్రిళ్లు ఈ పాట వింటే అలాగే నిద్రలోకి జారుకుంటారు.
అయితే ఈ పాటతో ఒక సమస్య ఉంది. ఇది అంజాన్ రాసిన ఉర్దూ పాట. పల్లవిని మాత్రమే నేను కొంత అనువదించే ప్రయత్నం చేస్తా.
“ఆప్ కి హసిన్ రుఖ్ పె ఆజ్ నయా నూర్ హై
మేర దిల్ మచల్ గయతో మేర క్యా ఖుసూర్ హై”
….
నీ ముఖారవిందంలో ఈ రోజు కొత్త వెలుగు ఉంది
నా మనసు చలిస్తే నా తప్పేముంది”
మిగతా పాట అనువదించాల్సిన అవసరం లేదు
అనుభవించాలి.. అంతే!
Enjoy this beautiful black and white wonder.

 

ఈ పాట ఇక్కడ వినండి

 

 

“బహారే ఫిర్ భి అయేంగి” గురు దత్ చివరి సినిమా.నిజానికి  హీరో గురుదత్ యే. అయితే, సినిమా మధ్యలో ఆయన చనిపోవడంతో ధర్మేంద్ర ను ఎంపిక చేశారు. దీనితో సినిమాని మొత్తం రీషూట్ చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *