“కేసీఆర్ లో భయం మొదలయ్యింది”

కేసీఆర్ పతనం కన్పిస్తోంది.
బీజేపీ ఉద్యమాలకు భయపడి సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారు
బీజేపీ లీగల్ సెల్ వారికి అండగా ఉంటుంది”
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం కన్పిస్తోందని, ఆయనలో భయం మొదలయింది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమాలు చేస్తున్నా కేసీఆర్ భయపడి పోలీసుల ద్వారా దాడులు చేయిస్తూ కేసులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. 317 జీవో సవరించాలని కోరుతూ తన కార్యాలయంలో ‘జాగరణ’ చేస్తే పోలీసులతో దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఇవి కేసీఆర్ లో భయం మొదలయింది అనేందుకు  సాక్ష్యాలు అని బండి సంజయ్ అన్నారు.
“ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోషల్ మీడియా పోస్టింగులు పెడుతున్న వారిపైనా కేసులు నమోదు చేస్తున్నారు, ఇది భయం కాదా!. రాష్ట్ట్రంలో గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు వేధింపులు తీవ్రమయ్యాయి. సోషల్ మీడియా కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదు. వారికి అండగా బీజేపీ ఉంటుంది,” అని భరోసా ఇచ్చారు. బాధితులకు న్యాయపరంగా తగిన సాయం అందించేందుకు బీజేపీ లీగల్ సెల్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
• ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు, సోషల్ మీడియా కార్యకర్తలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు వేధింపులు, నమోదు చేస్తున్న కేసుల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
• ఈ సందర్భంగా సోషల్ మీడియా కార్యకర్తలు మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే పోలీసులు తమ ఇండ్లపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారని వాపోయారు. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బీజేపీసహా ఇతర పార్టీలపై అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టులు పెట్టినా పట్టించుకోవడం లేదని, వాటికి కౌంటర్ ఇస్తే మాత్రం తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
• ఈ సందర్భంగా బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీ రెడ్డి, రామారావు స్పందిస్తూ సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా త్వరలోనే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయవాదులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని, దీంతోపాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో లీగల్ సెల్ కమిటీలను మరింత పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు రెండ్రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను కలిసి సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల వేధింపులను ఆపాలని కోరుతూ వినతి పత్రం అందజేస్తామన్నారు.
• అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల వేధింపులను అరికట్టడంలో అడ్వోకేట్స్ పాత్ర కీలకమన్నారు. అందుకోసం యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసి అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత-కుటుంబ-అవినీతి పాలనకు చరమ గీతం కావాలంటే ఉద్యమాలే శరణ్యమన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే రాష్ట్రంలోని న్యాయవాదులంతా మలిదశ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
• ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి తోపాటు వివిధ జిల్లాల నుండి పలువురు లీగల్ సెల్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు హాజరయ్యారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *