ఆస్తి మూరెడు, ఆశ బారెడు: టి.కాంగ్రెస్ దుస్థితి

ఇల్లు చక్కబెట్టుకోమంటే, నిప్పు పెట్టుకుంటున్నట్లుంది తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం. పార్టీలో యూనిటీ సాధించి నాలుగు వోట్లు తెచ్చుకోమంటే ఏమవుతున్నదో చూడండి. 
(వడ్డేపల్లి మల్లేశము)
స్వాతంత్య్రం అనంతరం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా వివిధ సందర్భాలలో చీలి పోయినప్పటికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు తో మనుగడలో ఉన్నది. అయితే ఇటీవలికాలంలో ఎన్డీఏ సమూహం బీజేపీ నాయకత్వం లో 2014 నుండి పదవిలో కొనసాగుతూ పరిపాలిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి నటువంటి సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి రైతు వ్యతిరేక చట్టాలు, చట్టాల రూపకల్పనలో చర్చలేకుండా ఆమోదించడం, శీతాకాల సమావేశాల మొదటి రోజున ప్రతిపక్ష సభ్యులను 12 మందిని బహిష్కరించడం పై కాంగ్రెస్ పార్టీ సీరియస్గానే పని చేసింది.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత కార్యక్రమాలు
భారత దేశ వ్యాప్తంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు  ధీటుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూపీఏ అధికారంలోకి రావడానికి వీలుగా ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై లో పార్లమెంటులో ఘాటుగానే స్పందిస్తున్న ది. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలు జరిగినటువంటి కొన్ని ప్రాంతాలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ తన వంతు కృషిని కొనసాగిస్తూనే ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకాన్ని ఇటీవలి కాలంలో అనేక రాష్ట్రాలలో నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నది.
ఆ క్రమంలోనే తెలంగాణ ఆవిర్భావానికి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి బాధ్యత వహించిన కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని ఆలోచించకుండా తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాన్ని ఆకాంక్షలను ప్రధానంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాకారము చేయడం 2014లో జరిగింది. దానికి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ నిలబడితే ఆమోదించి మద్దతు తెలిపిన పార్టీగా బీజేపీ చరిత్రలో నిలబడుతుంది అనడంలో సందేహం లేదు.
తెలంగాణ రాష్ట్ర పిసిసి నియామకం- కొన్ని సవాళ్లు:-
గత కొన్ని మాసాల క్రితం తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి లోక్ సభ సభ్యుడయిన అనుముల రేవంత్ రెడ్డిని నియమించింది. అప్పటిదాకా ఉన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన కొన్ని ఎన్నికలలో పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా పార్టీకి కొత్తనేత జవసత్వాలు తెస్తాడని రేవంత్ రెడ్డికి అధినాయకత్వం బాధ్యతలు అప్పగించింది.
ఆది నుంచి సీనియర్ల వ్యతిరేకతే
నూట ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఆటంకాల మధ్య సీనియర్ల వ్యతిరేకత, మరి కొంతమంది అలక, కారణాలు ఏవైనా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ బలోపేతానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పార్టీ సిద్ధాంతాలను ఒక సారి పరిశీలిస్తే లౌకిక, సామ్యవాద, గణతంత్ర, అట్టడుగు వర్గాల పక్షపాతిగా స్వతంత్ర అనంతరం నుండి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పనిచేస్తూనే ఉన్నది. కొన్ని కొన్ని లోపాలు పొరపాట్లు జరిగినప్పటికీ, అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టి తప్పటడుగు వేసినప్పటికి సాధారణ ప్రజల పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు ఉన్నది. అంతర్గత కుమ్ములాటలు నాయకత్వానికి పోటీపడడం తో పాటు వ్యతిరేకించే స్వభావం వలన కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నష్టపోతున్నది. దానికి తాజా ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం గా తీసుకోవచ్చు.
ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా  తెలంగాణతో పాటు  ఆంధ్రప్రదేశ్లో సైతం కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిన విషయం మనందరికీ తెలిసిందే.
దాని పర్యవసానంగా అక్కడ కనీసం కమిటీ కూడా లేకపోవడం విచారకరం. కానీ తెలంగాణ రాష్ట్రంలో కొంత ఊపులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరింత జవసత్వాలు తీసుకురావడానికి యువ నాయకుడు రేవంత్ రెడ్డిని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించడం పట్ల మొదట్లో అందరూ సంతోషించారు.
ఆ వూపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆత్మగౌరవ సభ ల పేరుతో ఇంద్రవెల్లి గిరిజన సమావేశం నిరుద్యోగ జంగు సైరన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రజా సమస్యలను తీసుకొని రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది.
అంతవరకు సమంజసమే కానీ ఇటీవలి ఉప ఎన్నిక సందర్భంగా మూడు వేల ఓట్లు మాత్రమే సాధించుకోవడం ప్రశ్నార్థకంగా మారింది.
(హుజురాబాద్లో) ఈ విషయం పట్ల పార్టీలో ఉన్నటువంటి భట్టి విక్రమార్క, హనుమంతరావు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి అనేక మంది సీనియర్లు రేవంత్ రెడ్డిని విమర్శించడం తోపాటు సహకరించక పోవడం వల్ల విశ్లేషణ లో రేవంత్ రెడ్డి కి మైనస్ పాయింట్స్. .
అందరినీ కలుపుకొని పోవడం లేదని, ఒంటెద్దు పోకడగా పోతున్నాడని, ఆధిపత్య భావనతో సమాచారం ఇవ్వడం లేదని, వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నాడని సీనియర్లతో పాటు అనేకమంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ విమర్శించడం వలన రేవంత్ రెడ్డి యొక్క ప్రతిభ ,నాయకత్వం క్రమంగా మసకబారుతున్న ది.
అనేక సందర్భాల్లో రాష్ట్రానికి చెందిన నాయకులు కేంద్ర అధినాయకత్వానికి పీసీసీ చీఫ్ ను మార్చాలని విజ్ఞప్తి చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.
జగ్గారెడ్డి  లేఖలో రేవంత్ రెడ్డి పై ఘాటైన విమర్శలు
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ నిలబెట్టలేదని, నిలబడ్డ వారికి పార్టీ పరంగా సహకారం లభించలేదని, రేవంత్ రెడ్డి పని తీరు మారాలని, ఒంటెద్దు పోకడ గా నాయకత్వం వహించడం మంచిది కాదని ,సీనియర్లను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నాడని జగ్గారెడ్డి ప్రధానంగా ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలను సోనియా గాంధీ రాహుల్ గాంధీ లకు ప్రత్యేక లేఖ ద్వారా వివరిస్తూ ఈ విషయం లోపల ఏదో కుట్ర దాగి ఉందని అవసరమైతే విచారణ చేపట్టాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేట్ సంస్థలా పనిచేయడం బాధాకరమని ఘాటైన విమర్శలు చేశాడు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరు ఆందోళనకరంగా ఉందని ఆయన వైఖరిని మార్చుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని లేకుంటే కొత్త వ్యక్తిని మార్చాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన లేఖలో కోరడాన్ని బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ  పరిస్థితిని అంచనా వేయవచ్చు.
నిరుద్యోగుల పక్షాన, కానీ దళిత గిరిజనుల పక్షాన గాని, దళిత బందు లాంటి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని కదిలించలేక పోయారని ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి మధ్యస్తంగా ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా లేకపోవడం విచారకరమని అనేకమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.
ఈ సందర్భంగా జగ్గా రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తానొక్కడినే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని తన అభిప్రాయాలను ప్రతిపాదనలను ఆమోదించకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక కార్పొరేట్ ఆఫీస్ వలె బ మారడం విచారకరమని ఆందోళన వ్యక్తం చేసి రాష్ట్రంలో రైతు సమస్యల పైన తీసుకున్న కార్యక్రమాల్లో తన ప్రాంతానికి వచ్చినప్పటికీ తనకు సమాచారం ఇవ్వకపోవడం పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటో అర్థం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.
పార్టీ ప్రయోజనాల రీత్యా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం మాత్రమే ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టాలని కేంద్ర అధినాయకత్వానికి జగ్గారెడ్డి తన లేఖలో ప్రస్తావించారు.
జగ్గారెడ్డి లేఖ మీద కాంగ్రెస్  దృష్టి పెట్టాలి
మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కారణంగానే రాష్ట్రంలో పార్టీ బలహీనత ప్రతి పక్షాలతో సహా కేంద్ర అధినాయకత్వాన్ని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా వ్యక్తిగత స్వార్ధానికి పాల్పడి ఎవరికి వారే పార్టీ ప్రయోజనాల కంటే భిన్నంగా తమ వ్యక్తిగత ప్రయోజనానికి పాల్పడడం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న దౌర్భాగ్యానికి ప్రత్యక్ష నిదర్శనం. తన భార్య నిర్మల దేవి ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా నిలబెట్టి 231 ఓట్లు వేయించుకున్నా నని కానీ పార్టీ పరంగా ఎలాంటి మద్దతు లభించకపోవడం ఆందోళనకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని మరింత రెట్టింపు చేసే క్రమంలో అవసరమైన మేరకు చర్యలు తీసుకుని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని కోరడాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు తేటతెల్లమవుతుంది.
అంతో ఇంతో లౌకిక సామ్యవాద లక్షణాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెరుగైన పాలన రాష్ట్రంలో ప్రజలకు అందుతుందనే అభిప్రాయంతో కొంతమంది  ప్రజలు ఉన్నారు.  అలాంటి ప్రజలకు పాలన చేసి చూపెట్టాలని దానికి సంబంధించి సంస్థాగత పరంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.  దీనిని రాష్ట్ర పార్టీ యంత్రాంగం తో పాటు కేంద్ర అధినాయకత్వం కూడా ఆలోచించి అవసరమైనటువంటి సంస్కరణలు తీసుకురావాలి.  చిన్న పెద్ద సీనియర్ నాయకులను కలుపుకొని పోయే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని సంస్కరించడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో ప్రస్తుత టీఆర్ఎస్ అపఖ్యాతి పాలన కు ప్రత్యామ్నాయ పరిపాలన అందించగలుగుతుంది.
కేవలంఆధికారంలోకి రావాలనే కోరిక ఉంటే చాలదు, శక్తి కూడా ఉండాలి. లేకుంటే సమకూర్చుకోవాలి.  కాంగ్రెస్ కు ఇపుడున్న స్తోమత్తు చాలా చాలా తక్కువ. దాన్ని పెంచుకోవడానికి కృషి చేయకుండా ఉన్నది వూడేలా ప్రవర్తించరాదు.
Farmers suicides Telangana
Vaddepalli Mallesam

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం (చౌటపల్లి).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *