చేనేతను ప్రలోభాలతో వంచించవద్దు

(వడ్డేపల్లి మల్లేశము)

మనిషి ఉనికి ని తీర్చిదిద్ది నాగరికతకు రంగులద్దే వస్త్రధారణ అంటేనే చేనేత అని చెప్పుకునే విధంగా భారతదేశంలో అనాదిగా ప్రాచుర్యం సంపాదించుకున్నది.

సుమారుగా శతాబ్దం పురం పచ్చి నుండి దారాన్ని తీసి చేనేత మగ్గాల ద్వారా వస్త్రాలను నేసిన నేతన్న గొప్పతనం తెలియనిది కాదు. వస్త్రాలు మగ్గం పైనేసే సందర్భంలోనే ప్రముఖుల చిత్రాలను వస్త్రంపై నేతలో చిత్రించి తమ సత్తా ఏమిటో అనేక మంది చేనేత కార్మికులు చాటుకున్నారు. సిరిసిల్ల కు చెందిన నల్ల పరంధాములు తో పాటు అనేక మంది చేనేత కళాకారులు అగ్గిపెట్టెలో పట్టే చీరను చేయడమే కాకుండా నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రాన్ని నేతలో చిత్రించి తమ ప్రతిభను చాటుకుని రాజకీయ ప్రముఖుల పెద్దల మన లు మన్ననలు పొందినారు.
చేతి ముగ్గు ద్వారానే ఎటువంటి నేతలు మాత్రమే చేనేత అని గతంలో అనేవారు కానీ మరమగ్గాల పైన సైతం అనేక మంది కార్మికులు తమ కళా హృదయాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ చెమట పడుచు పనిచేస్తూ ఉత్పత్తులు చేస్తున్న కారణంగా మరమగ్గాల పైన చేసినప్పటికీ కూడా దానిని చేనేత గాని భావించాల్సిన అవసరం ఇటీవలికాలంలో ఎంతగానో పెరిగిపోయింది.
మేత మగ్గాలు కూడా మరమగ్గాల కు పోటీ పడే స్థాయిలో ఒకవైపు పని చేస్తున్నప్పటికీ గిరాకీని తట్టుకోవడానికి కోసం ఉత్పత్తులను పెంచడం కోసం కూలి గిట్టుబాటు కోసం అనివార్యంగా మరమగ్గాల వాడకాన్ని కూడా చేనేతకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవలసి వస్తున్నది.
జిఎస్టి ఫారం పెంపు ఆందోళనకరం
స్వాతంత్ర పోరాట కాలం నుండి నేటి వరకు కూడా భారతదేశంలో చేనేత సాహిత్య సాంస్కృతిక పోరాట కార్యక్రమాల్లో అంతర్భాగంగా పనిచేస్తూనే ఉన్నది. సుమారుగా గత రెండు సంవత్సరాలుగా భారత దేశంలో కరోనా విజృంభణ కారణంగా ఒకవైపు గిరాకి లేక మగ్గాలు మూలకు పడటం ఒక ఎత్తు అయితే ధైర్యంతో ముందుకు వచ్చి ఉత్పత్తి చేసినటువంటి వస్త్రాలు ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోవడం హాస్టళ్లు ఇతర సంస్థలకు అమ్ముడుపోని కారణంగా ఉత్పత్తి సంస్థలు సంఘాలలో వస్తున్న నిల్వలు పేరుకుపోయాయి. చాలీచాలని కూలీ గిరాకీ ఎక్కువ లేకపోవడం అమ్మకాలు ఎక్కువ లేని కారణంగా పని చేతినిండా దొరకక చేనేత కార్మికులు ఒకవైపు వేదనకు గురవుతుంటే ఆ వర్గాలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉద్ధరించడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు సరిపోయినంత గా లేకపోవడమే కాకుండా రంగు నూలు ధరలు విపరీతంగా పెరగడంతో కాటన్ వస్త్రానికి గిరాకీ తగ్గిపోయింది.
 ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి!
2017 మే నెలలో చేనేత రంగాన్ని పూర్తిగా మినహాయింపు ఇవ్వడం ద్వారా ఉత్పత్తిని గిరాకీని కార్మికుల ఉపాధిని గణనీయంగా పెంచే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అప్పట్లో చేనేత రంగ నిపుణులు పారిశ్రామిక సంస్థలు కార్మికులు ఇది నిజమేనని ఆశించారు కానీ 2017 జూన్ నెలలోనే అంటే ఒక నెల తర్వాత చేనేత వస్త్రాల పైన జీఎస్టీ ని ఐదు శాతానికి అమలు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
2015 సంవత్సరంలో చెన్నైలో పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ చేనేత రంగాన్ని ప్రోత్సహించే దిశగా నేత వస్త్రాలు ధరించడానికి యువత సర్వ జనావళి ముందుకు రావాలని పిలుపునిచ్చిన విషయం ఒకసారి మనం చేసుకోవాలి. మేత వస్త్రాలను కూడా ఆధునిక డిజైన్లలో రూపకల్పన చేసి చేనేత రంగానికి జవసత్వాలు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని ప్రధాని ప్రకటించారు అంతే కాకుండా సామాజిక ఆర్థిక గా వెనుకబడి ఉన్నటువంటి చేనేత కార్మికుల స్థితిగతులను ఉద్ధరించడానికి మెరుగైన పథకాలను అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది.
గత కొన్ని దశాబ్దాలుగా చేనేత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలకు గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారు విషయాన్ని ఒక్కసారి మనం నెమరు వేసుకుంటే ప్రభుత్వ భరోసా కొంత ఉపయోగపడుతుందని ఆశించడం జరిగింది కానీ ఇదివరకు ఉన్నటువంటి జిఎస్టి ఐదు శాతానికి తోడుగా మరొక ఏడు శాతాన్ని పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే చేతే చేనేత రంగానికి భారీ షాక్ ఇచ్చింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ విధంగా ఇప్పటికే కునారిల్లుతున్న టువంటి చేనేత రంగాన్ని పునరుద్ధరించడానికి వీలు లేకుండా మరొక ఏడు శాతాన్ని ఎటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్ కోరిన విషయాన్ని గమనిస్తే కేంద్ర ప్రభుత్వం మాటల్లో చేతుల్లో ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చు. చేనేత రంగానికి సంబంధించిన కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినది కాదు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 88 లక్షల కార్మికులకు ఆందోళన కలిగించే విషయం.
చేనేత జౌళి రంగం పైన అదనంగా 37 శాతం తో మొత్తం 12 శాతం జీఎస్టీ పెను భారమై చిన్న మధ్య తరగతి నేత పరిశ్రమలను దివాలా తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని రాష్ట్రాలలో పురోగతి
పశ్చిమబెంగాల్ కాశ్మీర్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలలో చేనేత రంగానికి ప్రభుత్వం అందించే అండదండలతో నేత కార్మికుల జీవనోపాధి పై భరోసా అందుతున్న మాట అక్షర సత్యం. అయితే రాష్ట్రాల కృషికి తోడుగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ధరల తగ్గింపు సబ్సిడీలు ఉంటేనే చేనేత రంగం నిలబడుతుంది జాతీయ స్థాయిలో చౌకగా వస్త్ర అవసరాలను తీర్చగల అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా గత నాలుగైదు సంవత్సరాలుగా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఉచిత పంపిణీ కోసం సుమారుగా 20 30 వేల మంది కార్మికులకు పని కల్పిస్తూ చీరల ఉత్పత్తికి శ్రీకారం చుట్టడం పరిశ్రమను నమ్ముకున్న వారికి కొంత ఊరట. అయితే అవి ఏ మేరకు నాణ్యత గా ఉంటున్నాయి బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి చీరలు కట్టుకుంటే ఉన్నారా అనే విమర్శలు సర్వత్రా వినడమే కాకుండా నాణ్యతలేని చీరలు ఇచ్చినారు అని అనేక చోట్ల కాల పెట్టినటువంటి దుస్సంఘటనలు బాధాకరం ఈ విషయాన్ని పాలకులు ఆలోచించాలి.
కొన్ని సూచనలు:
రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చేనేత వస్త్రాల వినియోగాన్ని గణనీయంగా పెంచడం ద్వారా అవసరమైతే ప్రభుత్వ శాఖలకు పక్క ఆదేశాలు జారీ చేయడం ద్వారా యువత సామాన్య జనం బుద్ధి జీవులు మేధావులు విద్యార్థులు కూడా చేనేత వస్త్రాలను ఉపయోగించేలా ఇప్పించడం ద్వారా నమ్ముకున్న కార్మికులకు నిరంతరం పని కల్పించవచ్చు వేతనాలను ఎక్కువగా అందించవచ్చు అవసరమైనచో రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతన చట్టాన్ని కార్మికులకు అమలు చేయడం ద్వారా మంచి వేతనాలను అందించాలి. చేనేత వినిమయం ఐదు శాతం పెరిగితే ఆ రంగం ద్వారా వచ్చే రాబడులు 33 శాతానికి చేరుతాయని గతంలో ప్రధానమంత్రి ప్రకటించిన విషయాన్ని దానికి అర్థం చేసుకుంటే చేనేత వస్త్రాల వినయాన్ని పెంచవలసిన అవసరం ఎంతగానో ఉన్నదని తేలిపోతుంది. ప్రతి కోటి రూపాయల పెట్టుబడి ద్వారా సగటున వందమందికి స్థిరమైన ఉపాధి కల్పించే వచ్చునని కేంద్ర నీతిఆయోగ్ లెక్కగట్టిన వేల ఆ రంగాన్ని ఆ కార్మికుల ఉపాధిని ముమ్మరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో భారీ నిధులను కేటాయించి తన మాటను తానే నిజం చేసుకోవాలి. ప్రభుత్వం అనేది ప్రైవేటు సంస్థ కాదు లాభనష్టాల తో సంబంధం లేకుండా మానవ కనీస అవసరమైనటువంటి వస్త్రాల ఉత్పత్తి, దానిపై ఆధారపడిన కార్మికుల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి వీలైనన్ని చర్యలు తీసుకోవాలి ప్రధానంగా జీఎస్టీ ని అనేక రాష్ట్రాలు కోరినట్లుగా వెంటనే తగ్గించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. తద్వారా మరణశయ్యపై ఉన్నటువంటి చేనేత రంగాన్ని ఆకాశానికి ఎత్తవచ్చు అందరి సహకారం తోడుంటే.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *