భారతదేశపు తొలి మ‌హిళా న్యాయ‌వాది ఎవరో తెలుసా?

-షోహిని బోస్‌వివేక్ గుప్త‌
(అనువాదం : రాఘ‌వ శ‌ర్మ‌)
భార‌త దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నాటి మాట ఇది.మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ‌, స్వాతంత్య్రం క‌లగానే మిగిలిపోయేది. మ‌హిళ‌లు న్యాయ‌స్థానాల‌లో కేసుల‌ను వాదించ‌డానికి వీలులేదు. కుటుంబ స‌భ్యుల‌తో త‌ప్ప, ఎవ‌రితోనూ మాట్లాడ‌డానికి వీలుండేది కాదు.
కేసుల‌ కోసం బ్రిటిష్  పురుష న్యాయ‌వాదుల‌పైనే ఆధార‌ప‌డాల్సి వ‌చ్చేది. ఆ స‌మ‌యంలో మ‌హారాష్ట్ర‌కు చెందిన ఒక అమ్మాయి త‌న కోసంమే కాదు, మ‌హిళ‌లంద‌రి కోసం నిలబడి, పోరాడింది.
ఆమె పేరు  కొనీలియా సొరాబ్జి
కొరోనెలియా సొరాబ్జి లా పాసైన‌ప్ప‌టికీ లా డిగ్రీ ఇవ్వ‌కుండా ముప్పై ఏళ్ళు తిప్ప‌లుపెట్టారు. కోర్టుల‌లో వాదించ‌డానికి అవ‌కాశ‌మివ్వ‌లేదు. ఎగ‌తాళి చేశారు, వెక్కిరించారు.
కేసులు వాదించ‌నీయ‌కుండా రాత‌ప‌నికి ప‌రిమితం చేశారు. చివ‌రికి మ‌హిళా హ‌క్కుల పోరాటానికి ఆమె ఒక చిహ్నంగా నిలిచిపోయింది. ఇదొక దృఢ మ‌న‌స్థ‌త్వం, వ‌జ్ర‌సంక‌ల్పంక‌ల ఒక మ‌హిళ క‌థ‌.
భార‌త దేశంలోనే కాదు, బ్రిటన్‌లో కూడా మ‌హిళ‌ల హ‌క్కుల కోసం పోరాడిన తొలి మ‌హిళా న్యాయ‌వాది కొనీలియా సొరాబ్జి క‌థ‌. భార‌త దేశంలో మహిళల హ‌క్కుల‌ను ఎలుగెత్తి చాటిన తొలిమ‌హిళ ఆమె. అనేక విష‌యాల‌లో కూడా  ఆమె  తొలి మ‌హిళ‌.
నాసిక్‌కు స‌మీపంలోని దెవ్‌ల‌లీలో కొనీలియా సొరాబ్జి 1886లో ఎనిమిదిమంది తోబుట్టువుల మ‌ధ్య పుట్టింది. పార్సీ మ‌తానికి చెందిన  రెవ‌రెండ్ సొరాబ్జి కార్‌సెడ్జీ,  ఫ్రాన్సినా ఫోర్డ్ ఆమె త‌ల్లిదండ్రులు. ఒక బ్రిటిష్ జంట  రెవ‌రెండ్ సొరాబ్జి కార్‌సెడ్జీ ని ద‌గ్గ‌రు తీసి, పెంచి పెద్ద చేసింది.
ఆనాటి స‌మాజం అంగీక‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, ఆ దంప‌తులు త‌మ‌పిల్లంద‌రికీ ఇంగ్లీషు చ‌దువులు చెప్పించారు.పూనెలో బాలిక‌ల కోసం  ఫ్రాన్సినా అనేక మిష‌న్‌స్కూళ్ళ‌ను స్థాపించింది. అనేక వివాదాల‌లో స్థానిక మ‌హిళ‌ల‌కు స‌హాయ‌ స‌హ‌కారాలందించింది. ఆ త‌ల్లి  ఫ్రాన్సినా ,  కొనీలియా సొరాబ్జికి స్ఫూర్తిగా నిలిచింది.
Sorabji at Oxford (Credit :Ourmigrationstory.org
మిష‌న్ స్కూలులో చ‌దువు పూర్తి అయ్యాక  కొనీలియా సొరాబ్జి పూనెలోని డెక్క‌న్ కాలేజీలో చేరింది. అప్ప‌టికా కాలేజీలో చేరిన తొలి మ‌హిళ ఆమే. తోటి విద్యార్థుల‌నుంచి, ప్రొఫెస‌ర్ల నుంచి ఆమెకు వ్య‌తిరేక ఎదురైంది. కొనీలియా  సొరాబ్జి క్లాస్ రూంలోకి వ‌స్తుంటే, రాకుండా  త‌లుపులు మూసేసి, అబ్బాయిలు ఆమెను ఏడ్పించేవారు.
అనేక ఆటంకాల‌ను ఎదు ఎదుర్కొని మ‌రీ ఆమె 1988లో డిగ్రీ ఫ‌స్ట్ క్లాసులో పాసైంది. ముంబ‌యి యూనివ‌ర్సిటీలో తొలి ప‌ట్ట‌భ‌ధ్రు రాలిగా నిలిచింది. త‌న క్లాసులో టాప‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికీ, స‌హ‌జంగా టాప‌ర్‌కిచ్చే స్కాల‌ర్‌షిప్‌ను ఆమెకు ఇవ్వ‌లేదు. త‌న‌కు స‌హాయం చేయ‌వ‌ల‌సిందిగా పునె, ముంబ‌యిలోని కొంద‌రు ఇంగ్లీసు మ‌హిళ‌ల‌కు లేఖ‌లు రాసింది. వారి స‌హాయంతో 1889లో ఆమె ఇంగ్లాండ్ వెళ్ళి, ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన సోమ‌ర్ విల్లి కాలేజీలో చేరింది.
బ్రిటిష్ విశ్వ‌విద్యాల‌యంలో చ‌దివిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా  కొనీలియా సొరాబ్జి  గుర్తింపు పొందింది. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ సివిల్ లాలో  డిగ్రీ పాసైన తొలిమ‌హిళ‌గా ఆమె పేరు తెచ్చుకుంది.
అప్ప‌టివ‌ర‌కు కోర్టుల్లో న్యాయ‌వాదిగా ఏ మ‌హిళా త‌మ పేరును న‌మోదుచేసుకోలేదు. అందుచేత‌ కొనీలియా సొరాబ్జి లా డిగ్రీని ప్ర‌క‌టించ‌కుండా నిలుపుద‌ల చేశారు.
నిరుత్సాహ‌ప‌డ‌కుండా ఆమె 1894లో భార‌త‌దేశానికి తిరిగి వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఇక్క‌డ కూడా అదే ప‌రిస్థ‌ితి ఎదురైంది. త‌మ కుటుంబ స‌భ్యుల‌తో త‌ప్ప బైట‌వారెవ‌రితో క‌నీసం మాట్లాడ‌డానికి కూడా వీలు లేకుందా ఎప్పుడూ ప‌ర‌దాల వెనుక బ‌త‌కాల్సి వ‌చ్చిన మ‌హిళ‌ల‌కు సాయంచేయాల‌నుకుంది.
అలాంటి మ‌హిళ‌ల త‌రుపు కోర్టుల‌లో వాదించ‌డానికి  కొనీలియా సొరాబ్జిని అనుమ‌తించ‌లేదు. కానీ, వారి త‌ర‌పున బ్రిటిష్ లాయ‌ర్ల‌తో మాట్లాడ‌డానికి మాత్రం  కొనీలియా సొరాబ్జి కి ప్ర‌త్యేక అనుమ‌తినిచ్చారు.
బిట్రిష్ సామ్రాజ్యంలో  ఒక హ‌త్య‌కేసులో నిందితుల త‌ర‌పున‌ వాదించ‌డానికి 1896లో ఆమెకు అవ‌కాశం ల‌భించింది. భార‌త దేశంలోని ఒక బ్రిటిష్ న్యాయ‌మూర్తి ముందు వాదించిన‌ ఆ కేసులో ఆమె నెగ్గింది.
 కొనీలియా సొరాబ్జి 1887లో ముంబ‌యి యూనివ‌ర్సిటీ నుంచి ఎల్ ఎల్ బీ పూర్తి చేసి, అల‌హాబాద్ హైకోర్టులో 1899 లో ప్లీడ‌ర్ ప‌రీక్ష పాసైంది. అయిన‌ప్ప‌టికీ ఆమెకు బారిష్ట‌రుగా గుర్తింపు ల‌భించ‌లేదు. పురుష లాయ‌ర్ల ముందు కేసును వివ‌రించ‌డం, రాత ప‌నులు చేయ‌డానికి ఆమెను ప‌రిమితం చేశారు. అయినా  ఆమె నిరుత్సాహ‌ప‌డ‌లేదు.
ఆమెను చూసి అప్పుడ‌ప్పుడూ వెక్కిరించినా, త‌న ప‌నిని తాను చేసుకుంటూపోయింది. అయిదేళ్ళ త‌రువాత కోర్టు కేసుల్లో స‌హ‌క‌రించ‌డానికి ఆమెకు అవ‌కాశం ల‌భించింది.
బెంగాల్‌లోని న్యాయ‌స్థానాల వార్డుల‌కు తొలి మ‌హిళా స‌హాయ‌కురాలిగా  1904లో ఆమెను నియ‌మించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ నియ‌మించిన ఈ కోర్టు వార్డులు ఎస్టేట్ల వార‌సత్వ‌పు హ‌క్కుల‌ను కాపాడే స్వ‌తంత్ర సంస్థ‌లు.
బీహార్‌, ఒడిస్సా, అస్సాంల‌లో 1907 నుంచి కేసుల‌కు స‌హాయ‌కారిగా ప‌నిచేసింది. త‌రువాత ఇర‌వై ఏళ్ళ పాటు 600 మంది పైగా మ‌హిళ‌లు, అనాథ పిల్ల‌ల  చ‌ట్ట‌ప‌ర‌మైన హ‌క్కుల కోసం  నిస్వార్ధంగా కృషి చేసింది. ముప్పై ఏళ్ళ త‌రువాత ఆమె పట్టుద‌ల‌కు గుర్తింపు ల‌భించింది.
న్యాయంగా త‌న‌కు రావ‌ ల సిన డిగ్రీప‌ట్టాకోసం  కొనీలియ సొరాబ్జి 1920లో లండ‌న్ వెళ్ళింది. రెండేళ్ళ త‌రువాత  భార‌త దేశంతోపాటే బ్రిట‌న్‌లో కూడా తొలి న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేయ‌డానికి లండ‌న్ నుంచి అనుమ‌తి వ‌చ్చింది.
భార‌త దేశంలో మ‌హిళా న్యాయ‌వాదుల‌కు కోర్టులు త‌లుపులు తెరుచుకున్న‌ప్పుడు, 1924లో కొనీలియ సొరాబ్జి తొలి మ‌హిళా న్యాయ‌వాది నిల‌బ‌డ్డారు.
కొనీలియ సొరాబ్జి  తొలి మ‌హిళా న్యాయ‌వాది మాత్ర‌మే కాదు, ర‌చ‌యిత్రి, సంఘ‌సేవ‌కురాలు, బాల్య‌వివాహాల‌కు, స‌తీస‌హ‌గ‌మ‌నానికి వ్య‌తిరేకంగా పోరాడిన‌ సంఘ‌సంస్క‌ర్త‌.
‘ప‌ర‌దాల‌కు అతీతంగా ప్రేమ‌, జీవితం’ (Love and Life Behind the Purdah),  ‘షుబాల‌- ఒక ప‌సిత‌ల్లి’ (Shubala: A Child-Mother) అన్న పుస్త‌కాలు రాశారు. కైస‌ర్‌-ఈ-హింద్ (Kaisar-i-Hind) బంగారు ప‌త‌కం 1909లో ఆమెను వ‌రించింది.
కొనీలియ సొరాబ్జి త‌న న్యాయ‌వాద వృత్తిని 1929లో ఒదిలేసి సంఘ సేవ‌కు త‌న జీవితాన్ని అర్పించారు. రెండేళ్ళ త‌రువాత ఆమె లండ‌న్‌కు వెళ్ళిపోయింది. కొనీలియ సొరాబ్జి త‌న 88వ ఏట 1954 జులై 6న క‌న్నుమూసింది. లండ‌న్‌లో  2012లో ఆమె విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.
ఆమె 150వ జ‌యంతి సంద‌ర్భంగా న్యాయ‌శాస్త్ర విద్యార్థుల‌కు కొనీలియ సొరాబ్జి  స్కాల‌ర్‌షిప్ మొద‌లైంది. భార‌త దేశంలో మ‌హిళా హ‌క్కుల కోసం కొనీలియ సొరాబ్జి వేసిన బాట ప్ర‌పంచ వ్య‌ప్తంగా మ‌హిళా న్యాయ‌వాదుల‌కు స్పూర్తి దాయ‌క‌మైంది. ఆమె అలా ‌స్మ‌ర‌ణీయురాలైంది.
(‘ద క్వింట్‘ సౌజ‌న్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *