నేడు తిరుపతిలో రాయలసీమ సభ

*నేడు తిరుపతిలో.. “అభివృద్ధి వికేంద్రీకరణ” రాయలసీమ మనోగతంపై భారీ బహిరంగ సభ.అమరావతియే ఆంధ్రప్రదేశ్ ఎకైక రాజధాని అంటూ నిన్న అమరావతి రైతులు తిరుపతిలోనే బహిరంగ సభ ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో తమవాదన వినిపించేందుకు కొందరు రాయలసీమ మేధావులు నేడు ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు.ప్రాంతీయ ప్రముఖులు, మేధావులు ఈ సభలో పాల్గొంటున్నారు.
“రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక” ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతూ వుంది.
తుడా ఇందిరా మైదానంలో శనివారం(18-12-2021) ఉదయం 10 గంటలకు భారీ బహిరంగ సభ జరుగనుంది..
ఈ సభకు ప్రముఖులు, మేధావులు విచ్చేయనున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, రాయలసీమ అభివృద్ధి ఆవశ్యకతను విశదీకరించనున్నారు..
ప్రముఖులు, మేధావులు..
ప్రముఖ కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత, సుప్రసిద్ధ రచయిత గౌరవనీయులు బండి నారాయణ స్వామి గారు..
రాయలసీమ కార్మిక, కర్షక సంఘ అధ్యక్షులు, రాయలసీమ ఉద్యమకారులు గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు,
సుప్రసిద్ధ రచయిత, రాయలసీమ మహాసభ అధ్యక్షులు గౌరవనీయులు శాంతి నారాయణ..
హైకోర్టు న్యాయవాది, రాయలసీమ ఉద్యమకారుడు గౌరవనీయులు శివారెడ్డి ..
కుందు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు, రాయలసీమ ఉద్యమకారుడు వేణుగోపాల్ రెడ్డి..
ఉత్తరాంధ్ర పోరాట సమితి అధ్యక్షులు రాజాగౌడ్ (విశాఖ)..
నేషనల్ కాపు ఫ్రంట్ అధ్యక్షులు నరహరిశెట్టి శ్రీహరి (విజయవాడ)..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి(ఆప్స్) వర్కింగ్ ప్రెసిడెంట్ కొణిజేటి రమేష్(విజయవాడ)..
ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫ్రంట్ ప్రెసిడెంట్ గౌరవనీయులు ఎమ్. ఆర్. ఎన్. వర్మ(విశాఖ) గారు.. హాజరుకానున్నారు..
రాయలసీమ అభివృద్ధికి చేపడుతున్న సభ విజయవంతం చేయాలని వారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *