బొబ్బాది నాగరాజు, గదబ ఆదివాసీ, చినకోనాం చీడికాడ మండలం,విశాఖ జిల్లా. నాగరాజు – కొండమ్మ వారి తాత తండ్రుల కాలం నుంచికొంత భూమి సాగు చేసుకుంటున్నారు. ఆ భూమి వారి ఆదీనం లొనే ఉందనేందుకు చాలా కాగితాలు ఉన్నాయి. ఈ భూమి రికార్డులు రాత్రికి రాత్రి కంప్యూటర్లలో మారిపోయాయి. భూములనుంచి ఆదివాసీలను గెంటివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గదబ ఆదివాసీలను రాష్ట్ర ప్రభుత్వం “ఆదిమ తెగలకు’ (PVTG) చెందిన ఆదివాసీలుగా గుర్తించింది. కోనాం రెవిన్యు గ్రామం నాన్ షెడ్యుల్ ఏరియాలో వుంది. అంటే ఇక్కడి ఆదివాసీలకు రాజ్యంగo ఇచ్చిన ప్రత్యేక ఆదివాసీ రక్షణలు వర్తించవని అర్ధం. వీరు సివిల్ కోర్టు పరిధిలోకి వచ్చేస్తారు. దీంతో ప్లీడర్ల’ను పెట్టి ఆదివాసీలపై సివిల్ కేసులు వేయడం, ఆ కేసులలో తిప్పి ఆర్దికంగా, మానసికంగా దేబ్బతీయటం నాన్ షెడ్యుల్ ఆదివాసీ ప్రాంతాలలో ఒక ఆనవాయితీగా మారింది. ఆదిమతెగలకు చెందిన ఆదివాసీలకు, వారి సాగు అనుభవానికి రక్షణ కల్పించవలసిన రెవిన్యు అధికారులు గిరిజనేతరులు ఇచ్చే లంచాలకు కక్కుర్తిపడి భూములు ఖాళి చేయమని ఆదివాసీలను బెదిరిస్తున్నారు.ఈ వీడియో చూస్తే అన్యాయం ఏమిటో తెలుస్తుంది.అధికారులే ఇలా చేస్తే వాళ్ళు ఎవరి దగ్గరకు వెళ్ళాలి?