వరద జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటన

అమరావతి:
డిసెంబరు 2, 3 తేదీలలో వరద ప్రభావిత వైయస్సార్‌ కడప, చిత్తూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు.
*తొలిరోజు వైయస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటిస్తారు.
*నేరుగా బాధిత ప్రజలు, రైతులతో ఇంటరాక్టవుతారు.
*భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును స్వయంగా పరిశీలిస్తారు.
*ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా మాట్లాడతారు.
*మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన తిరుపతిలోనూ సీఎం పర్యటన
*రెండో రోజూ చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో సీఎం పర్యటన*
*పెన్నానదీ పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంటపొలాలను పరిశీలిస్తారు.
*డిసెంబరు 2న సీఎం పర్యటన వివరాలు:
ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి వైయస్సార్‌ కడప జిల్లా బయలుదేరనున్న
10.50 గంటలకు వైయస్సార్‌ కడప జిల్లా మందపల్లి(రాజంపేట) చేరుకుంటారు. అక్కడ నుంచి పుల్లపొత్తూరు గ్రామానికి వెళ్లతారు. పుల్ల పొత్తూరు గ్రామంలో  వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారు. సహాయశిబిరంలో ఉన్న బాధితులతో సీఎం ముఖామఖి.
మధ్యాహ్నం 12 గంటలకు పుల్లపొత్తూరు గ్రామ సచివాలయానికి చేరుకుంటారు.
అక్కడ నుంచి ఎగుమందపల్లిలో  వరద బాధిత ప్రాంతాలను చూస్తారు. ఎగుమందపల్లి నుంచి నేరుగా అన్నమయ్య డామ్‌ సైట్‌కి వెళ్లి   దెబ్బతిన్న ప్రాజెక్టును పరిశీలిస్తారు
మధ్యాహ్నం 2.15 గంటలకు మందపల్లి చేరుకుని వరద నష్టం, అనంతర సహాయ చర్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తారు.   మధ్యాహ్నం 3.05 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వేదలచెరువు, ఎస్టీ (యానాది) కాలనీకి చేరుకుని, కాలనీ ప్రజలతో వరదనష్టంపై మాట్లాడతారు.
4.30 గంటలకు ఏర్పేడు మండలం, పాపనాయుడు పేటలో వరద నష్టాన్ని స్వయంగా పరిశీలిస్తారు. అక్కడ నుంచి తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్‌కు వెళ్లతారు.
అనంతరం తిరుపతిలో
సాయంత్రం 6 గంటలకు వరదనష్టం, సహాయ, పునరావాసంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు.
రాత్రి పద్మావతి అతిధి గృహంలో బస
*డిసెంబరు 3 వ తేదీన ఉదయం తిరుపతి, కృష్ణానగర్‌లో పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా  నెల్లూరు రూరల్, దేవరపాలెం చేరుకుని, అక్కడ భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆర్‌అండ్‌బి రోడ్డును, దెబ్బతిన్న వ్యవసాయ పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామం వెళతారు.
పెన్నానదీ వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను, వ్యవసాయ పంటలను పరిశీలిస్తారు.
అక్కడ నుంచి పెనుబల్లి జొన్నవాడ చేరుకుని, వరద ధాటికి కొట్టుకుపోయిన ఆర్‌ అండ్‌ బి రహదారిని, పంచాయతీరాజ్‌ రోడ్లతో పాటు ఇసుక మేటలు వేసిన వరిపొలాలను స్వయంగా పరిశీలిస్తారు. భారీ వర్షాలకు పంటలు, పశువులు నష్టపోయిన రైతులతో సీఎం ముఖాముఖి ఉంటుంది.
మధ్యాహ్నం 1.15 గంటలకు నెల్లూరు నగరపాలక సంస్ధ పరిధిలో భగత్‌ సింగ్‌ కాలనీకి చేరుకుని
వరద ప్రభావంతో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు.
అక్కడ నుంచి దర్గామిట్ట, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చేరుకుని వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు.  అనంతరం 3.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని  తాడేపల్లి వెళ్లతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *