వరి గొడవ మీద కాట్రగడ్డ ప్రసూన వ్యాఖ్యలు

(కాట్రగడ్డ ప్రసూన)
 ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తి లో మొదటి స్థానంలో ఉన్నట్లు పదే పదే మాయమాటలు చెప్పి తెలంగాణ రైతాంగాన్ని మాయ చేస్తున్నారు
వాస్తవానికి వరి పంట ను కేవలం మన తెలంగాణ లో పండించడం లేదు. పాటు చాలా రాష్టాలు, వెస్ట్ బెంగాల్ , ఉత్తర ప్రదేశ్ ,పంజాబ్, తమిళనాడు , ఆంధ్ర ప్రదేశ్,బీహార్,ఛత్తీస్గఢ్ లు కూడా వరి పంట ఉత్పత్తి లో అగ్రస్థానంలోనే ఉన్నాయి.
కొంచం ఒక స్థానము అటు ఇటుగా తెలంగాణ ఉంది . వరి ఉత్పత్తి పై తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెప్తూ పబ్బం గడపటం కేసీఆర్ కి పరిపాటి అయింది. ఎప్పుడు అయిన ఫార్మ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఉన్నత స్థాయి అధికారులతో సమాచారం సేకరిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి.
 ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో రాని  వడ్ల కొనుగోలు సమస్య, పంజాబ్ లో రాని సమస్య, తమిళనాడులో రాని సమస్య, ఛత్తీస్గఢ్ లో రాని సమస్య,ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రాని సమస్య కేవలం తెలంగాణలో మాత్రమే ఎలా వచ్చింది.? దీనిని యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాల్సిన అవసరం ఉంది.
వరి ఉత్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఒక్క ఉత్తర ప్రదేశ్ లో తప్ప ఎక్కడా బీజేపీ అధికారంలో లేదు.
 ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడే మాట మాటకు పొంతన లేదు.
రాష్ట్రం లో కనిపించే ప్రతి నీటి ప్రాజెక్ట్ నేనే కట్టిన అని చెప్పుకుంటు ప్రతి ఎకరా కి నీటి సదుపాయం అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ మాత్రమే అని గొప్పగా చెప్పుకొన్న ముఖ్యమంత్రి  మరి రైతులు పండించిన పంటలు సరైన సమయంలో అమ్ముకోవడం కోసం నానా అవస్థలు పడుతున్న విషయం చూడ్డం లేదా?
దీనిపై ప్రభుత్వ పెద్దగా, కేంద్రం మెడలు వంచి, ప్రతి గింజ కొనే వరకు కేంద్రం పై వత్తిడి తెచ్చి అండగా ఉండాల్సింది పోయి  ధర్నాలకు దిగడం ఏమిటి? అధికారంలో ఉన్నా పారీ ధర్నాచేస్తుంటే విడ్డురం గా ఉంది. మాయ మాటలు చెప్పి ఇంకా ఎంత కాలమో తెలంగాణ ప్రజానీకాని మోసం చేయలేరు.
 ముఖ్యమంత్రి గారు, మీరు గతంలో ఫామ్ హౌస్ కాదు ఫార్మర్ హౌస్ అని  చెప్పుకున్నారు.  ఆదర్శవంతమైన వ్యవసాయo చేసి వ్యవసాయ రంగంలో కొత్త కొత్త మెళుకువలు సృష్టించి , కోట్లు గడించడం ఎలానో కూడా చెప్పారు.దానికి ఒక రైతుగా నేను అభినందనలు తెలియచేస్తున్న.. అంత విజ్ఞానవంతులైన మీరు, రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు పెట్టి వ్యవసాయ రంగంలో మెలకువలు నెర్పొచు కదా! పేద రైతులు కూడా కోట్లు గడిస్తారు కదా..!
మరో వైపు బీజేపీ పార్టీ దక్షిణాది రాష్టాలని చిన్న చూపు చూస్తుంది అనడానికి నిదర్శనం ఈ వడ్ల కొనుగోలు పై జాప్యం ..పంజాబ్ రాష్ట్రానికి ఒక నీతి, తెలంగాణ రాష్టానికి కి ఒక నీతి ఏంటో తెలంగాణ బీజేపీ శాఖ నాయకులు చెప్పాలి. వాళ్లు
తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న.
 మీ  పార్టీలు గల్లీ లో లొల్లి ,ఢిల్లీలో లో దోస్తీ కడుతూ తెలంగాణ ప్రజలని మోసం ముమ్మాటికీ చేస్తున్నారు. వీరి ఇరువురు వైఖరి ఎలా ఉంది అంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్లు ఉంది.. దీనిని ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు.. తగిన గుణపాఠం చెప్పే రోజు మరెంతో దూరంలో లేదు
 నిజంగా రైతుల కోసం ధర్నాలు, పాదయాత్ర లు, పరామర్శ లు చేసే బదులు ప్రతి గ్రామంలో రైతులు పండించిన పంట సరైన ధరలు వచ్చే వరకు స్టోరేజ్ చేసుకునేలా ప్రతి మండలంలో గోడౌన్ లు కట్టి , స్టోర్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చెయ్యవచ్చు కదాం?
ఎన్నికల్లో అయితే కోట్లు కుమ్మరించి రాజకీయాలు చేయడానికి అయితే ఇరు పార్టీలు చూపించే చొరవ , ఆరుగాలాల పాటు చెమటోడ్చి రైతన్న పండించిన వడ్లకి కొనడానికి డబ్బు లు లేవా?
 కేసీఆర్ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ అన్నాడు చేశాడా ? రైతులకి ఉచితంగా యూరియా ఇస్తాను అని చెప్పాడు ఇచ్చాడా ? ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి కొన్ని వందల హామీలు నీటిమీద మాటలు గానే మిగిలిపోయాయి ..
 ఇప్పటికైన యావత్ తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ అరాచకపు, అవినీతి, అంధకారపు పాలన ని చూసి రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి, దక్షిణాది రాష్టాలని చిన్న చూపు చూసే మోడీ సర్కారు కి తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాఖ తరపున వేడుకొంటున్నాను.
(కాట్రగడ్డ ప్రసూన, మాజీ శాసనసభ్యురాలు,తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *