చైనా కోవిడ్-19 వ్యూహంపై ఒక వివరణ  

డాక్టర్.ఎస్.జతిన్ కుమార్
 ఇటీవల కరోనా మహమ్మారి పెరగడం వల్ల చైనా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోందని  మన దేశీయ మీడియా,  పశ్చిమ వార్తా ఛానెళ్లు  బాగా ప్రచారం చేస్తున్నాయి. వారిలో చాలా మంది చైనా వ్యూహాన్ని అర్థం చేసుకోలేరు. గ్లోబల్ టైమ్స్ సిఎన్ లో వచ్చిన నివేదికలు కూడా “అవుట్ బ్రేక్”,  “కోవిడ్ యొక్క పునర్  వ్యాప్తి ” మొదలైన పదాలను ఉపయోగిస్తున్నాయి. కానీ ఆ పదాల ద్వారా మనం లేదా పశ్చిమ దేశాలు  అర్థం చేసు కున్న దానికి పూర్తిగా భిన్నంగా వారి భావన  ఉంటుంది. ఇక్కడ వెయ్యి మంది మరణించినప్పటికీ మనము “పరిస్థితి నియంత్రణలో ఉంది” అని వివరిస్తాము, కానీ చైనీయులు ‘ జీరో టాలరెన్స్’  ( ఒక్క కేసు కూడా రాకూడదనే) విధానాన్ని అనుసరిస్తు న్నారు 

“ప్రతిసారీ ఒక వ్యాప్తి సంభవించినప్పుడు, జీరో-కోవిడ్ విధానం అమలు చేయడం అంటే ఆర్థిక, సామాజిక ఖర్చులు పెరిగిపోతాయి. కానీ మేము ఈ విధానాన్ని అవలంబించకపోతే, ఇది వైరస్ యొక్క తీవ్రమైన వ్యాప్తికి దారితీస్తుంది, ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుంది”, అని చైనా ఆరోగ్య అధికారుల నివేదిక పేర్కొంది. జీరో-కోవిడ్ విధానాన్ని సమర్థిస్తూ, గ్లోబల్ టైమ్స్ లో ఒక వ్యాసం ఇలా పేర్కొంది, “మేము యూరోపియన్ దేశాలు, యు.ఎస్ అనుసరిస్తున్న   “వైరస్ తో సహజీవనం” అనే రీతిలో మా మార్గాన్ని మార్చుకుంటే, చైనా కేవలం కొన్ని నెలల్లోనే వైరస్ బారిన పడుతుంది, రోజుకు పదుల వేల లేదా వందల వేల కేసులు కూడా సంభవించవచ్చు. “, చైనా దానిని ఏ పరిస్థితిలోనూ  కోరుకోదు. అప్పుడు “రోజువారీ మరణాల సంఖ్య వందల లేదా వేల మందికి పెరుగుతుంది. ఈ పరిస్థితి ఖచ్చితంగా  చైనీయులు భరించడానికి సిద్ధంగా ఉన్న విషయం కాదు”, అని తెలిపింది
వారు భిన్నంగా స్పందిస్తున్నారు 
వైరస్ వ్యాప్తిని ఆపడానికి, వాయువ్య గాన్సు ప్రావిన్స్ అక్టోబర్  18 నుండి 31  వరకు ఆరు నగరాల్లో 83 నివాస సమ్మేళనాలను మూసివేసింది. అక్టోబర్ 18 నుండి 31 వరకు, గాన్సు రాష్ట్రంలో  కేవలం 105 ధృవీకరించిన కేసులను మాత్రమే నివేదించారు. అయినప్పటికీ  వారు దీనిని  “అంటువ్యాధి యొక్క తాజా పునరుజ్జీవనం” అని పిలిచారు.
స్థానికుల ద్వారా నే  సంక్రమించిన వని  కొన్ని  ధృవీకరించబడ్డ కోవిడ్-19  కేసులను ప్రావిన్స్  ఆరోగ్య శాఖ నివేదించింది. వాయవ్య నింగ్క్సియా హుయి అటానమస్ రీజియన్ వెంటనే  కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి భౌతిక తరగతులను రద్దు చేసింది. ఆ సస్పెన్షన్ ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది.  కిండర్ గార్టెన్లు, ప్రాథమిక,మాధ్యమిక పాఠశాలలు, వృత్తి పాఠశాలలు, ప్రాంతీయ రాజధాని యిన్చువాన్ లోని ఆఫ్-క్యాంపస్ శిక్షణా కేంద్రాలు, అలాగే  షిజుయిషాన్,  వుజోంగ్ ,  జోంగ్వీనగరాలలో తరగతులను నిలిపివేయాలని ఆదేశించినట్లు ప్రాంతీయ విద్యా శాఖ తెలిపింది.
Dr Jatin Kumar
Dr Jatin Kumar
సమీపంలోని పర్యాటక నగరంలో కోవిడ్-19 యొక్క కొన్ని కేసులను అధికారులు కనుగొన్న తరువాత, ఒక  బీజింగ్ నివాసిని  మూడు వారాలు అక్కడే వుంచేశారు. దీనిలో ఎక్కువ భాగం క్వారంటైన్ లోనే. గోబీలో ఉన్న చైనా ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని మారుమూల ప్రాంతమైన ఎజిన్ బేనర్ లో  ఇలా 9,000 మందికి పైగా పర్యాటకులను నిలిపి వేశారు. ఇలాటి పర్యటనలకు వెళ్ళిన వారు  ఆయా ప్రాంతాలలో కేసులు వున్నట్లు తెలిస్తే , 3 వారాల వరకు బీజింగ్ నగరానికి రాకుండా ఆంక్షలు విధించారు.  ఆ ప్రజలు కూడా  ఈ నిబంధనలు పాటిస్తూ అధికారులతో సహకరిస్తున్నారు. అలా వ్యాధి వ్యాప్తిని అరికడుతున్నారు. అక్టోబర్ 28న48, 29న59 కొత్తకేసులు కనిపించిన దశలోనే వారు ఇలాటి ముందు జాగ్రత్త  చర్యలు తీసుకుంటున్నారు 
వ్యాక్సినేషన్ కు సంబంధించి
చైనా  మొత్తం 224.5 కోట్ల  మోతాదుల్లో కోవిడ్-19 టీ కాలు  ఇచ్చింది. 141.2 కోట్ల  జనాభాలో దాదాపు 106.8 కోట్ల మంది ఇప్పుడు అవసరమైన మోతాదులతో ఇనాక్యులేట్ చేయబడ్డారు. అక్టోబర్ 23 నాటికి చైనా తన జనాభాలో 75.6 % మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ల పూర్తి మోతాదులను ఇచ్చిందని జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్  తెలిపారు.
 వారి చివరి మోతాదు తీసుకుని  కనీసం ఆరు నెలలు పూర్తి అయిన వారికి , బూస్టర్ షాట్, ఇస్తున్నారు. వారి ప్రాధాన్యతా సమూహాలలో  ముందు వరసలో  అవసరమైన కార్మికులు, వృద్ధులు,బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు వున్నారు.  
చైనా చాలా ప్రాంతాల్లో వైరస్ చెదురుమదురుగా ఉంది, ఇతర దేశాలలో కనిపించే వాటితో పోలిస్తే స్థానిక వ్యాప్తి [కేసుల సంఖ్య] చాలా తక్కువగా ఉంది. 11 ప్రావిన్షియల్ ప్రాంతాల్లో వారంలో కేవలం 100 సంక్రామ్యతలు కనిపించగానే, చైనాలో తాజా వ్యాప్తి ప్రమాదం పెరుగుతోందని అధికారులు హెచ్చరించారు.[మన౦ ఎప్పుడైనా ఈ రకం శ్రద్ధ తీసుకున్నామా, మన ప్రజలను జాగరూకులను చేసామా? ] గత నెలలో బీజింగ్ నగరం లో 20 కేసులు నమోదు అయ్యాయి. వెంటనే ఆంక్షలు అమలు చేశారు. నవంబర్ 8 నుండి 11 వరకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ అతి ముఖ్యమైనదిగా భావించే ప్లీనరీ సమావేశం బీజింగ్ లో జరిగినది. దేశ వ్యాప్తంగా వున్న 370 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈసందర్భంగా తీసుకున్న జాగ్రత్తలు,రక్షణాత్మక చర్యలు  చెప్పుకోదగ్గవి. అలాగే 2022 ఫిబ్రవరిలో బీజింగ్ లో జరగబోయే   వొలం పిక్  క్రీడల కోసం  కరొన రక్షణ పధకాలు ఇప్పటినుండే అమలు చేస్తున్నారు.   
ఆంక్షలను రెట్టింపు చేయడం
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ రేట్లు పెరగడంతో, ఇంతకు ముందు కఠినమైన కోవిడ్-నియంత్రణ వ్యూహాలను కలిగి ఉన్న దేశాలు కూడా ఆంక్షలను తగ్గించి వేశాయి, కానీ  చైనా తన శూన్య-సహన విధానాన్ని గట్టిగా పాటిస్తోంది. ఆంక్షలను  రెట్టింపు చేస్తోంది.  చైనా యొక్క  సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధిపతి గావో ఫు ఇటీవల దేశం  లో 85% జనాభా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత  నిబంధనలు సడలించ వచ్చని సూచించారు –  ప్రజలు కూడా దాని కోసం ఆత్రుతగా ఉన్నారని ప్రభుత్వానికి తెలుసు. “మీరు త్యాగం చేసిన సమయం, లేదా మీరు ఎంత డబ్బు ఖర్చు చేసినప్పటికీ, జీవితం ముందు, ఆరోగ్యం ముందు, ఆ విషయాలు పేర్కొనదగినవి కావు,” అని వాంగ్ అన్నారు. “ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం, సమాజం మరింత స్థిరంగా ఉండటానికి, కొంతమంది త్యాగాలు చేయాలి.”  అనేది వారి ఆలోచనా విధానం.  
 ” వ్యాధి సోకిన వారిలో కొద్ది శాత౦ మ౦ది మాత్రమే ఆసుపత్రుల్లో చేర వలసి వచ్చినా, దాని భారీ జనాభా దృష్ట్యా అది చైనాలో ఒక సమస్యగా ఉ౦డవచ్చు,  మరణాల సంఖ్యను  చాలా తక్కువగా ఉ౦చే౦దుకు శతవిధాల  ప్రయత్నిస్తున్న  ప్రభుత్వానికి అది ప్రత్యేక౦గా స౦క్లిష్ట౦గా ఉ౦టు౦ది.” అని వారు భావిస్తున్నారు.
కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ కు చెందిన హువాంగ్ పరిస్థితిని ఈ క్రింది విధంగా సంక్షిప్తీకరించాడు – ” ప్రభుత్వ నాయకులు, సామాజిక వేత్తలు, వైద్య పండితులు ప్రజారోగ్య అధికారులు ఆందోళన చెందుతున్నారని నేను అనుకుంటున్నాను (అంటే), ఆరోగ్య రక్షణలో ఒక చిన్నపొరపాటు కూడా చాలా పెద్ద స్థాయిలో  వ్యాధి వ్యాప్తికి దారితీయవచ్చు,” 
 ఇప్పటివరకు చైనా సుమారు 5,600 మరణాలను నివేదించింది – వారి  జనాభాలో పావు వంతు కంటే తక్కువ ఉన్న యు.ఎస్.లో సంభవించిన  7,55,000  మరణాలతో పోలిస్తే ఇది ఎంత తక్కువ. చైనా ఎంత పకడ్బందీగా వ్యాధిని అరికడుతున్నదీ గమనించాలి  
ప్రపంచ ఆరోగ్య సంస్థ  17-11-2021 న ప్రకటించిన  గణాంకాలు:
ఇప్పటివరకు మొత్తం కేసులు ప్రపంచవ్యాప్తంగా 25,42,56,432 నమోదయితే, చైనాలో        1,27,331 వున్నాయి. మొత్తం మరణాలసంఖ్య 51,12,461 అందులో చైనా లో మరణాలు 5697. గత 24 గంటల్లో ప్రపంచంలో 5,84,044కేసులు నమోదు కాగా  చైనాలో కొత్తకేసులు 39మాత్రమే. అలాగే గత 24 గంటల్లో మరణాలు 7370 కాగా చైనాలో  మరణాలు లేవు.  
     
చైనా, కోవిడ్ 19 వ్యాధి బారిన  ఉందని  నిర్ధారించుకుందామా? చైనా పాలనా యంత్రాంగం ప్రజల ఆరోగ్యం పట్ల  తీసుకుంటున్న శ్రద్ధను ప్రశంసించుదామా? కోవిడ్  కేసులు తగ్గుముఖం పట్టగానే , మిగిలిన ప్రపంచం అంతా కోవిడ ఆంక్షలు సడలించి  తిరిగి తెరుచుకుంటున్నది కానీ , వైరస్ యొక్క పూర్తి నిర్మూలనను ఇప్పటికీ వెంటాడుతున్న [‘జీరో కోవిడ్ హోల్డ్ ] ఏకైక దేశం చైనా.
(డాక్టర్ జతిన్ కుమార్ హైదరాబాద్ లో ఆర్థోపేడిక్ సర్జన్)

 

                             

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *