భారత్ తిరిగొచ్చిన అన్నపూర్ణా దేవి

దాదాపు వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణా దేవి విగ్రహం తిరిగి కాశీకి పయనమైంది. ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి భారత్‌కు తీసుకురాగా.. గురువారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా అందజేశారు.
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఈ విగ్రహాన్ని యూపీ ప్రభుత్వానికి అప్పగించారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ,మీనాక్షీ లేఖి సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
నాలుగు రోజుల పాటు శోభాయాత్ర నిర్వహించి నవంబరు 15న కాశీలో విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు. గురువారం ప్రత్యేక రథంలో ఈ విగ్రహాన్ని ఢిల్లీ నుంచి అలీగఢ్‌ తీసుకెళ్లారు.
నవంబరు 12న కనౌజ్‌కు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అయోధ్య వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు.
ఆ తర్వాత నవంబరు 15న వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *