హుజూరాబాద్ ఊపులో బిజెపి ఉద్యమాలు

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ 20 వేల పైబడిన మెజారిటీతో గెలుపొందడతంతో భారతీయ జనతా పార్టీ ఉబ్బితబ్బిబ్బవుతున్నది. దీనితో హుజూరాబాద్ ఇచ్చిన ఊపుతో  ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమం నిర్వహించి టిఆర్ ఎస్ ప్రభుత్వం మీద  అసంతృప్తితో ఉన్న వర్గాలను సమీకరించాలని చూస్తున్నది.  ఈ ఆందోళన కార్యక్రమాన్ని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్  ప్రకటించారు. హుజూరాబాద్ పార్టీని ఎలా ఉత్తేజ పరించిందో ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల సహనాన్ని పిరికితనంగా భావించిన సీఎంకు 30న జరిగిన పోలింగ్ లో బీజేపీ కార్యకర్తలు చూపిన తెగువ అసామాన్యమని, బీజేపీ కార్యకర్తల పోరాటం మామూలు విషయం కాదు, వారు చూపిన తెగువ, పోరాటానికి నా హ్యాట్యాఫ్ అనిసంజయ్ ప్రకటించారు.
‘హుజూరాబాద్ ప్రజల్లో తెలంగాణ రక్తం ప్రవహించేలా ఈటల రాజేందర్, బీజేపీ కార్యకర్తలు చేసిన కృషి ఎనలేనిది. దేశమంతా హుజూరాబాద్ ప్రజల గొప్పతనాన్ని చర్చించుకుంటున్నరు. డబ్బుల ద్వారానే గెలవాలనే పార్టీలకు హుజూరాబాద్ ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు,’ అని ఆయన అన్నారు.
దేశం కోసం, ధర్మం కోసం పోరాడే నాలాంటి వారు ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే మాట్లాడేందుకు వెనుకాడేవాళ్లం. కానీ హుజూరాబాద్ ప్రజలు చూపిన దారి, ఇచ్చిన తీర్పుకు నా సెల్యూట్ అని సంజయ్ అన్నారు.
ఇకపై ఎక్కడ ఉప ఎన్నికలొచ్చినా గెలిచేది బీజేపీనే. తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే.  హుజూరాబాద్ లో మంత్రులు గ్యాస్ సిలిండర్లు మోసినా…పెట్రోలు ధరలపై కేంద్రాన్ని బద్నాం చేసినా ప్రజలు బీజేపీ పక్షానే నిలిచిండ్రు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాల్సిందే. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి తీరాల్సిందే,అని ఆయన అన్నారు.
9న డప్పుల ఉద్యమం
• ఈనెల 9న హైదరాబాద్ లో వేలాది మందితో ‘డప్పుల మోత’ ఉద్యమం నిర్వహిస్తాం. కేసీఆర్ చెవుల్లో నుండి రక్తం వచ్చేలా మోత మోగిస్తాం. దళిత బంధు అమలు చేసేదాకా పోరాడతాం.ఈనెల 9న సీఎం కేసీఆర్ చెవుల్లోనుండి రక్తం కారేలా వేలాది మందితో డప్పుల మోత ఉద్యమాన్ని చేయబోతున్నం.
• ఈనెల 16న బీజేపీ ఆధ్వర్యంలో లక్షలాది యువతతో ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’. కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చేదాకా ఉద్యమిస్తం.
• తెలంగాణలో రైతాంగం వరి పండించి తీరుతుంది…. కేసీఆర్ మెడలు వంచైనా సరే… వరి పంటనంతా కొనిచ్చి తీరుతం. వరి రైతు ఉద్యమం ముందు ముందు
• రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేదాకా ఉద్యమాలు కొనసాగిస్తాం…ఎల్లుండి నుండి ఆందోళనలు షురూ చేస్తున్నం..
• ఈనెల 16న బీజేపీ ఆధ్వర్యంలో లక్షలాది యువతతో ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’ చేసి చూపుతం. టీఆర్ఎస్ కు దమ్ముంటే అడ్డుకోవాలి.
• గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపించేదాకా బీజేపీ యావత్తు పోరాడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *