ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక

*విశాఖపట్నం:
ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని,అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

 ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన     అల్పపీడనం  ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం తో వర్షాలు రానున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
 ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారుతుంది. అది బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తాంధ్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఈ నెల 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ  వెల్లడించింది.
రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు.
 ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
 ఈ నెల 9, 10వ తేదీల్లో తమిళనాడులోనూ… 10, 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలోనూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
 ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9 లోపు తీరప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *