-స్వరాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేశారు.
-రైతు పండించిన పంటకు గిటుబాటు లేక రైతు మరణాలు సంభావిస్తున్నా చలించడం లేదు
-పంటసాగు విషయంలో గడికోమాట మాట్లాడూతు రైతు ఊసురు తీసుకుంటున్నా సర్కార్.
-సమైఖ్యరాష్ట్రంలో కూడ రైతులు టోకెన్ల కొసం నిలబడలేదు.
-కేసీఆర్ కు సబ్బండ వర్గాల ఉసురు
తాకడం మొదలైయింది.అది హుజరాబాద్ తో ప్రారంభంమైంది.
ఉద్యమాలతో ఏర్పాడిన తెలంగాణ రాష్ట్రన్ని కేసీఆర్ సర్వనాశం చేశారని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక అల్లడుతుంటే ధాన్యం కొనాలంటే టోకెన్లు తీసుకుని అమ్మే దుస్థికి తీసుకువచ్చారని అయన అవేదన వ్యక్తం చేశారు.నల్గొండ జిల్లాలో మామిడి బీరయ్య అనే రైతు 10 రోజుల క్రితం తను పండించిన ధాన్యాన్ని కొనుకోలు కేంద్రానికి తెచ్చి ఆకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యాన్ని చూసి చలించి అక్కడే ప్రాణాలు కొల్పోవడమంటే ఇది ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వ అసమర్ధత,కేసీఆర్ చేతకాని తననికి నిలువెల్ల సాక్షమన్నారు. తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చేప్పుకోవడంకాదని రైతులను అన్నిరకాలుగా అదుకోవాలన్నారు. ఇప్పటికే చాలా కేంద్రల్లో వడ్లు కొనుగోలు మొదలు కాలేదని వర్షం వస్తే పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. సమైఖ్యరాష్ట్రంలో కూడ రైతు ఇంతగా పీడనకు గురికాలేదని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమకారుల రైతులు,నిరుద్యోగుల,సబ్బండ వర్గాల ఊసురు తగలడం మొదలైందని అది హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలనుండే ప్రారంభమైందన్నారు. స్వరాష్ట్ర ఏర్పాటు కొరకు అనేక ఉద్యమాలు చేసిన అసలైన ఉద్యకారులు కాదని ఉద్యమ ద్రోహులను, కుల బంధువులను అందలం ఎక్కించి రాక్షాసానందరం పొందుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చేప్పారని అన్నారు.తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి,తెలంగాణ భవన్ నిర్మాణానికి రాళ్లెత్తిన తెలంగాణ వాదులను ఒక్కొక్కరిగా బయటకు పంపి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు,ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారికి మంత్రి పదవుల, ఇచ్చి అసలైన ఉద్యమకారలకు ద్రోహం చేసినందుకే తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి రగులుతుంది.సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరుతుందని చెప్పిన పెద్ద మనిషి రెండు సార్లు తెలంగాణ ప్రజల సహకారంతో ముఖ్యమంత్రి అయ్యి అనేక రంగాలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. నీళ్లు ,నిధులు, నియామకాలు కొరకై ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఒక్క కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందంటే అయన యోక్క స్వార్థపూరిత బుద్ది బట్టబయలైందని చేప్పారు.నిరుద్యోగులకు ఉద్యాగాలు లేవు, ఉద్యోగులకు జీతాలు కూడా జిల్లాలకు ఆల్ఫాబెటికల్ ఆర్డరులో ఇచ్చే దుస్థితకి ఈ ప్రభుత్వం నెట్టివేశారని అన్నారు.
ఉద్యమ సమయంలో చేసిన వాగ్ధానాలను, 2014,2018 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కి ఏ ఒక్క వాగ్ధానము అమలుచేయని వ్యక్తిగా ముఖ్యమంత్రి చరిత్రలో మిగిలిపోయారని చేప్పారు..రైతులకు ఒక సారి మొక్కజోన్న వేయోద్దని, ఇప్పుడు వరి వేయోద్దని రైతులకు ద్రోహం చేస్తూన్నారు.మరి వరి వద్దని చేప్పిన కేసీఆర్ లక్షల కొట్లులతో ప్రాజెక్టులు కట్టడంలో అంతర్యం ఏమిటో ప్రజలకు చేప్పాలని ప్రశ్నించారు. కేవలం కమీషన్ల కొసం ప్రాజెక్టలు కట్టడానికి ఆప్పలు చేస్తూ అప్పుల తెలంగాణ గా మారుస్తూన్నారని అరోపించారు. తెలంగాణ అమరుల సమాదుల పునాదుల మీద రాజ్యమేలుతూ అడుగడుగునా పక్షపాతం బందుప్రీతి, అవినీతిలో తెలియాడుతూ సబ్బండ వర్గాలు పోరాడితే వచ్చిన తెలంగాణ ను వాడోకో బెల్టు షాపు పెట్టి సంబ్బండ వర్గాలకు మోసం చేస్తూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నవ్వుల పాలు చేస్తూ పరిపాలన కొనసాగుస్తూన్నారన్నారు. ఇప్పటికైన ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లు తెరిచి తెలంగాణ వాదులను,రైతులను ఉద్యమ సమయంలో పోరాడిని నాయకులను ఆదరించి రాష్ట్రం సర్వతో ముఖాభివృద్దికి తొడ్పడాలని కొమ్మూరి హితువు పలికారు.