*టీడీపీని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు వైయస్ఆర్సీపీ ఎంపీల విజ్ఞప్తి
“బోషడీకే” అంటూ అనాగరికమైన భాషను మాట్లాడిన టీడీపీ నేతలపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
*కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసిన అనంతరం వైసీపీ నేత విజయ సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు
1- ఆంధ్రప్రదేశ్ లో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని… చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కమిషన్ సభ్యులకు మెమోరాండం సమర్పించాం.
2- తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్, దేవినేని ఉమా, , బోండా ఉమ, అయ్యన్నపాత్రుడు, పట్టాభి తదితరులు చేసిన వ్యాఖ్యలను ఎలక్షన్ కమిషన్ సభ్యులు ఇద్దరికీ విపులంగా చెప్పడం జరిగింది.
3- టీడీపీ నేతలు అసభ్యకరమైన, ఫిల్తీ లాంగ్వేజితో.. రాజ్యాంగ బద్ధంగా, ప్రజల చేత ఎన్నిక కాబడ్డ, రాజ్యంగ ఫంక్షనరీని ఆ విధంగా తిట్టడం శోచనీయం. వారు వాడిన భాష పట్ల ఎలక్షన్ కమిషన్ సభ్యులు కూడా ఆశ్చర్యపోవడం జరిగింది.
4- నాగరిక సమాజంలో.. అనాగరికంగా, బోషడీకే అనే పదాన్ని చంద్రబాబు తనయుడు నారా లోకేష్, బోండా ఉమ, దేవినేని ఉమా, అయ్యన్నపాత్రుడు.. తదితరులంతా తెలుగులో లంజా కొడకా.. ఇంగ్లీషులో బాస్టర్డ్ అంటూ పోలీసు అధికారుల్ని, ప్రభుత్వ అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని, గౌరవ ముఖ్యమంత్రిగారిని సంబోధించడం అనాగరికమైన చర్య. వీరిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి అని కోరాం.
5- తెలుగుదేశం పార్టీ తెలుగుదొంగల పార్టీగా తయారైంది. ఏపీలో టెర్రరిస్టు అవుట్ ఫిట్ గా దీనిని చిత్రీకరించవచ్చు. టీడీపీ ఉపయోగిస్తున్న భాష, వారి అసాంఘీక చర్యలను ఎలక్షన్ కమిషనర్లకు వివరించి, ఈ పార్టీని రద్దు చేయమని కోరడం జరిగింది.
6- ఒక టెర్రరిస్టు అవుట్ ఫిట్ లాంటి పొలిటికల్ పార్టీని.. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తే.. తద్వారా దొంగలు, టెర్రరిస్టులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే దేశం పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి.
7- రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం దొంగలకి, తెలుగుదేశం టెర్రరిస్టులకు స్థానం ఉండకూడదన్న విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కు వివరించాం.
8- వీటిపై కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు స్పందిస్తూ.. ఇటువంటి భాష మాట్లాడిన టీడీపీ నేతలపై కేసులు పెట్టడం జరిగిందా అని అడిగారు. కేసులు పెట్టినట్లైతే.. ఆ ఎఫ్ఐఆర్ కాపీలను పంపించమని కోరారు.
9- అలానే.. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ అయిన స్థానిక సంస్థల నుంచి 11 స్థానాలు.. ఎమ్మెల్యేలు ఎన్నుకునే 3 స్థానాలు భర్తీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశాం. దీనిపై ఎలక్షన్ కమిషన్ పాజిటీవ్ గా స్పందించింది.
కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసిన వారిలో ఎంపీలు, శ్రీ మార్గాని భరత్, శ్రీ రెడ్డప్ప, శ్రీమతి భీశెట్టి వెంకట సత్యవతి, శ్రీ సంజీవ్ కుమార్, శ్రీమతి గొడ్డేటి మాధవి తదితరులు పాల్గొన్నారు.