అగ్రవర్ణాల కోసం ప్రత్యేక సంక్షేమం శాఖ

   ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేసమయిన   ఏపీ కేబినెట్‌ భేటీలో ఆమోదించిన పలు అంశాలు.
►అమ్మఒడి పథకానికి అర్హత ఉన్న వారందరికీ జూన్‌, డిసెంబర్‌లో అర్జీకి అవకాశం కల్పిస్తాం.
►వైద్య, విద్య, కుటుంబ సంక్షేమశాఖలో ఉద్యోగాలకు ఆమోదం.
►కొత్తగా 1,285 ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ అంగీకారం.
►560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో ఫార్మాసిస్టుల పోస్టుల భర్తీకి ఆమోదం.
►వైద్య కళాశాలల్లో 2,190 ఉద్యోగాల భర్తీకి ఆమోదం.
►ఇప్పటి వరకు మొత్తం 4,035 కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోదం.
►వైద్య ఆరోగ్యశాఖలో 41,308 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ఉంటే.. ఇప్పటివరకు 26,197 ఉద్యోగాలు భర్తీ చేశాం.
►రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ అందించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం.
►శ్రీశారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాలు కేటాయింపుకు కేబినెట్‌ ఆమోదం.
►అనంతపురం జిల్లాలో వేదపాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటుకు ఆమోదం.
►కొత్తగా జైన్‌, సిక్కు కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం.
►అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
►సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం.
►జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపుకు ఆమోదం.
►పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్‌ ఆమోదం.
►రాష్ట్రంలో 5చోట్ల సెవన్‌ స్టార్‌ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం.
►ప్రకాశం జిల్లాలో జేఎన్‌టీయూ, గురజాడ వర్సిటీలకు ఆమోదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *