అదానీ, అంబానీ, ఇతర కార్పొరేట్ సంస్థలకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. భారతదేశంలో ఆహార ధాన్యాల మార్కెట్‌పై ఈ సంస్థలు దృష్టి పెట్టాయి. కానీ వాటికి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అందువల్ల వాళ్ళు ముందుకు పోవడం కష్టమైంది. వాటిని తక్షణం పరిష్కరించాలి.ఎలా? అబ్రకదబ్ర. అపుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘నేనున్నాను’ అని భరోసా ఇచ్చారు. చిటికెలో సమస్యలు మాయమయ్యాయి. ఇది రైతులకు నచ్చలేదు. వాళ్ళు ఆందోళన బాట పట్టారు. దాదాపు యేడాది కాలంగా కేంద్ర ధోరణిని వ్యతి రేకిస్తున్నారు. ఇంత దీర్ఘకాలిక సమ్మె చరిత్రలోనే లేదేమో.
అంబానీ, అదాని అండ్ కో లకు వచ్చిన సమస్యలేమిటి, వాటిని ప్రధాని ఎలా పరిష్కరించారో చూద్దాం. రైతులకు అసంతృప్తి, అంబానీ, ఆదానీ లకు సంతోషాన్ని ఇచ్చిన ఆ కథేంటి?
సమస్య1
రైతుల నుండి ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడానికి రాష్ట్రాలుకు వేర్వేరు నియమనిబంధనలు ఉన్నాయి. పన్నుల విధానం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇన్ని రాష్ట్రాల్లో లాబీ నిర్వహించడం కార్పొరేట్లకు కష్టంగా ఉంది. ఈ సమస్యను అధిగమించాలి
మోడీ పరిష్కారం:
భారతదేశం ఫెడరల్ వ్యవస్థ. వ్యవసాయం రాష్ట్రాల పరిధి లోనిది. కేంద్రం వ్యవసాయ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన నాలుగు నల్ల చట్టాలతో వ్యవసాయ రంగాన్ని కేంద్రం తన నియంత్రణలోకి తీసుకుంది. మొత్తం దేశం కోసం ఒక చట్టం కేంద్రం చేసింది.
కార్పొరేట్ సంస్థలు సంతోషించాయి.
సమస్య 2
కార్పొరేట్ సంస్థలు పెద్దమొత్తంలో పంటలను కొనుగోలు చేసి వాటిని నిల్వ చేయాలనుకుంటాయి. అయితే నిత్యావసర వస్తువుల చట్టం దానికి అంగీకరించదు. పంటలను ఎక్కువ కాలం నిల్వ చేయకుండా నిరోధిస్తుంది.
మోడీ పరిష్కారం
నిత్యావసరాలచట్టాన్ని రద్దుచేసింది.దీంతో ఆహార ధాన్యాలు,నూనె గింజలు,బంగాళాదుంపలు, ఉల్లిపాయలు తదితర నిత్యావసరాల సరుకులు ఎన్నైనా,ఎంతకాలమైనా నిల్వ చేసుకొని,కృత్రిమ కొరత సృష్టించి లాభం పొందవచ్చు. కార్పొరేట్లకు మళ్లీ సంతోషం.
సమస్య 3
రైతులు ఏ రకమైన పంటను పండిస్తారో అంచనా వేయడం కష్టం.
మోడీ పరిష్కారం
కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని రంగంలోకి తెచ్చింది., అక్కడ కార్పొరేట్లు డిమాండ్ ఉన్న పంటను పండించమని చెబుతూ రైతులకు ప్రారంభంలో అధిక ఆదాయం ఎరను వేస్తాయి. తర్వాతకాలంలో అధికపెట్టుబడుల కారణంగా రైతులు భూములను కార్పొరేట్లకే తెగనమ్ముకుని,వారి భూముల్లో వారే కూలీలుగా మారతారు. *కార్పొరేట్లకు మళ్లీ సంతోషం.
సమస్య 4
జరుగుతున్న, మోసాన్ని గ్రహించి కార్పొరేట్లకు వ్యతిరేకంగా రైతులు కోర్టుకు వెళితే కార్పొరేట్ సంస్థలకు చౌకగా భూములు దక్కే ప్రక్రియ ఆలస్యం కావడం,చివరకు భూములను రైతులకే వదిలేసే పరిస్థితి రావడం వంటివి జరిగితే మొత్తం బెడిసికొడుతుంది.
మోడీ పరిష్కారం
ఫాం కాంట్రాక్టర్ మరియ రైతులకు మద్య వివాదాలను పరిష్కరించుకోవడానికి తీసుకొచ్చిన చట్టంతో రైతులు రెగ్యులర్ కోర్టులకు వెళ్ళే వీలు లేకుండా చేసాడు. వారు కలేక్టర్ మరియు ఆర్డీవో ల వద్ద మాత్రమే ఫిర్యాదు చేయాలి ( న్యాయమూర్తులుగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధానాలనే అమలుచేస్తారు,అక్కడ రైతుసమస్యలు పరిష్కారమౌతాయని ఎవరికీ నమ్మకాలుండవు.). కార్పోరేట్ శక్తులు ప్రభుత్వ అండతో న్యాయాన్ని వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది.
దీంతో మళ్లీ సంతోషించారు.
వాస్తవం ఇలా ఉండగా బిల్లులు రైతుల పక్షాన ఉన్నాయని మోదీ చెప్పడం.
*తన క్యాబినెట్ తో సహా ప్రతి భారతీయుడిని ఎలా మాయ చేస్తున్నాడో గమనించండి.
భారత రాజధాని “న్యూఢిల్లీ” సరిహద్దుల్లో వేలాది ట్రాక్టర్లు మరియు లక్షలాది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత “భారత ప్రభుత్వం” వారిపై విధించిన మూడు చట్టాల రద్దు కోసం వారు చేస్తున్న పోరాటం చారిత్రాత్మక ఉద్యమంగా ప్రపంచం గుర్తించింది.
దయచేసి రైతులకు మద్దతు ఇవ్వండి., మీరు తినే ప్రతి అన్నం మెతుకులో రైతుల శ్రమ ఉందని గ్రహించండి. భూమి చరిత్రలో అత్యంత అందమైన అధ్యాయం” రాసే ప్రయత్నంలో రైతులకు మద్దతు ఇవ్వండి.