అంతర్జాతీయ జ్యోతిష పురస్కారం అందుకున్న డాక్టర్ కృష్ణభార్గవ

 

– అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారం, యూఎస్ఎ ఆష్ట్రోలాజికల్ ఫెల్లోషిప్ అందుకున్న ఏకైక తెలంగాణ జ్యోతిష్యుడు

– వరల్డ్ ఆష్ట్రోలజర్స్ బయోగ్రఫీ లో ప్రముఖ స్థానాన్ని పొందిన డాక్టర్ మోహనకృష్ణ భార్గవ

న్యూఢిల్లీ: : జనగామ జిల్లాకి చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితుడు, సామాజిక వేత్త డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవకు అరుదైన గౌరవం, ప్రపంచ స్థాయి గుర్తింపు లభించాయి. ఇంటర్నేషనల్‌ ఆష్ట్రోలజీ ఫెడరేషన్(యూఎస్ఎ) మరియు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సొసైటీస్, ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సైన్సెస్, మహర్షి పరాశర జ్యోతిష్య విశ్వవిద్యాలయం, సంస్థలతో పాటు ప్రపంచ ప్రముఖ జ్యోతిష్య సంస్థలు, విశ్వవిద్యాలయాల సంయుక్త నిర్వహణలో న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా జరిగిన వేదిక్ ఆస్ట్రోలాజికల్ కన్క్లేవ్-2021. అంతర్జాతీయ జ్యోతిష్య సంస్థల సమ్మేళనంలో డాక్టర్ మోహనకృష్ణ భార్గవ అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సభలో లోక్ సభ సభ్యులు సునీల్ బి. మెందే, ఉత్తరాకాండ్ మాజీ మంత్రి నంద కిషోర్, ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సైన్సెస్ చైర్మెన్ డా” గాయత్రి దేవి వాసుదేవ్, నాగ్పూర్ యూనివర్సిటీ ప్రోఫెసర్ మహేంద్ర నింబార్థే, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సైన్సెస్ చైర్మెన్ ఆచార్య అరున్ బన్సాల్, మహర్షి పరాశర జ్యోతిష్య విద్యాలయ చైర్మెన్ డా” హెచ్.ఎస్. రావత్, ఆల్ ఇండియా నవ్ యుగ్ ఆష్ట్రోలజర్స్ ఫెడరేషన్ చైర్మెన్ డా” దిలీప్ కుమార్ మరియు పలువురు ప్రముఖుల చేతుల మీదుగా మోహనకృష్ణ అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారాన్ని అందుకున్నారు,

మెమెంటో, అవార్డ్ ఆల్బమ్, ప్రశంసా పత్రంతో సత్కరించారు. కాగా మోహనకృష్ణ డిస్కషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ ఫోర్ కాస్ట్ లో భాగంగా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో జ్యోతిష్య శాస్త్ర పరంగా దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై పరిశోధన వ్యాసాన్ని రచించి ఐఏఎఫ్ సంస్థ తరుపున కేంద్ర ప్రభుత్వానికి అందించారు.

ఇంటర్నేషనల్ ఆష్ట్రోలజీ ఫెడరేషన్ సంస్థ తరుపున అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ఎ(యునైటెడ్ స్టేట్స్) ఆష్ట్రోలాజికల్ ఫెల్లోషిప్ అందుకున్నారు. ఐఏఎఫ్ ప్రపంచస్థాయి ప్రముఖ జ్యోతిష్యుల విజయాలను వరల్డ్ ఆష్ట్రో బయోగ్రఫీ పేరుతో ముద్రించగా అందులో మోహనకృష్ణ చోటు దక్కించుకున్నారు, ప్రముఖంగా రెండు పేజీల బయోగ్రఫీ ప్రచురించబడింది. తెలంగాణా నుండి వరల్డ్ ఆష్ట్రోలర్స్ బయోగ్రఫీ మరియు అమెరికన్ ఆష్ట్రోలాజికల్ ఫెల్లోషిప్ అందుకున్న ఏకైక తెలంగాణ జ్యోతిష్యుడిగా గుర్తింపునొందారు.

ఈ సందర్భంగా ఐఏఎఫ్ సంస్థ ఇండియా వైస్ చైర్మన్ దివ్య పిల్లైయ్ మాట్లాడుతూ మోహనకృష్ణ భార్గవ జ్యోతిష్య శాస్త్రంలో చేసిన పరిశోధనలు, శాస్త్రీయ సేవలను గుర్తించి ఈ అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారాన్ని అందించినట్లు తెలిపారు. మోహనకృష్ణ పూర్వం జ్యోతిష్య విశ్వ విద్యాపీఠం నుండి పిహెచ్‌డి డాక్టరేట్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సైన్సెస్ యూనివర్సిటీ నుండి జ్యోతిష్య మహర్షి తరగతులు పూర్తి చేస్కున్నారు, యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఆష్ట్రో అక్కోల్ట్ సైన్సెస్ యూనివర్సిటీ నుండి జ్యోతిష్య విశారద, శిరోమణి తరగతులు పూర్తి చేస్కున్నారు.

జ్యోతిష్యంలో రెండు సిద్ధాంత‌ గ్రంథాలు రచించారు, అనేక పరిశోధన వ్యాసాలు రాశారు. మోహనకృష్ణ మాట్లాడుతూ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సైన్సెస్ యూనివర్సిటీ నుండి ఇండియన్ ఎకానమీ ఫోర్ కాస్ట్ రాయడానికి అవకాశం లభించిందని, తన పరిశోధనా వ్యాసం ఎంపిక కావడం ద్వారా ఈ అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కారాన్ని అందుకునే అవకాశం లభించిందని తెలియజేశారు. ప్రపంచ స్థాయి జ్యోతిష్య ప్రముఖుల జీవిత చరిత్రల్లో చోటు దక్కటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు‌.

ఈ పురస్కారానికి తన పేరు ఎంపిక చేసిన సంస్థ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు‌. మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ, తెలంగాణ ఉద్యోగుల సంఘం కన్వీనర్‌ మార్త రమేష్, మరియు అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు గజ్జెల నర్సిరెడ్డి, యాదగిరి రెడ్డి, కృష్ణమూర్తి, మల్లారెడ్డి, శ్రీశైలం, సత్యనారాయణ, కృష్ణకుమార్, శాయితేజ, మహేందర్ తదితరులు అభినందనలు తెలియజేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *