కెసిఆర్ నెక్స్ట్ టార్గెట్ హరీష్ రావే అంటున్న రేవంత్

హుజురాబాద్ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నాయి. కారణం, ఇక్కడి ఎన్నికల్లో బలమయిన నాయకుడు ఈటెల రాజేందర్ బిజెపి అభ్యర్థిగా ఉండటం. టిఆర్ ఎస్ పార్టీ  గెల్లుశ్రీనివాస్ ను అభ్యర్థిగా నిలబెట్టినా, పోటీలో ఉన్నది  ముఖ్యమంత్రి కెసిఆర్ అనే భావన హుజూరాబాద్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ క్యాంపెయిన్ చూస్తే అర్థమవుతుంది. రెన్నెళ్లుగా ఆర్థిక మంత్రి హరీష్ రావు అక్కడే ఉంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు, అక్కడ నిధుల కుంభవృష్టి కురిపిస్తున్నారు. క్యాంపెయిన్ హోరాహోరీగా సాగుతూ ఉంది. ఈటెల గెలిస్తే.. ఎలా ఉంటుంది,గెలవకుండా టిఆర్ ఎస్ వస్తే ఏమవుతుంది ? అనే చర్చ రాష్ట్రలో సాగుతూ ఉంది.  ఈ నేపథ్యంలో  కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాబోయే పరిణామాల మీద ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేశారు. రాజేందర్ తరహాలోనే ఆర్థిక మంత్రి హారీష్ రావే  కెసిఆర్ నెక్స్ట్ టార్గెట్ అని అన్నారు

Revanth Reddy

అవే ఇవి

తర్వాత టీఆరెఎస్ లో చాలా మార్పులోస్తాయని, పార్టీ లో తిరుగుబాటు తప్పదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి సోమవారం నాడు  వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ శాసన సభా పక్ష కార్యాలయంలో ఆయన  మీడియాతో మాట్లాడారు.

నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవని చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత తిరుగుబాటు తప్పదని, దీనికి కెసిఆర్ సంకేతాలు వదులుతున్నారని అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..

విజయ గర్జన సభ పెడ్త అని కేసీఆర్ ప్రకటించడం రాబోయే తిరుగుబాటును ఎదుర్కోడానికే , పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ భయంతోనే వున్నడు.  అది బయటపడకుండా ప్రవర్తిస్తున్నడు అంతే.

ముందస్తు ఎన్నికలు రావాని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా వుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కలిసి రావు. 6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. , విజయ గర్జన సభలు కేసీఆర్ భయంతోనే పెడ్తుండు. ఇవే టీఆరెఎస్ పార్టీకి చివరి సభలు అవుతయి.

 

తదుపరి టార్గెట్ హరీష్ రావు

హరీష్ రావు ను కూడా కేసీఆర్ త్వరలో పార్టీ నుండి బయటికి పంపుతాడని, మిత్ర ద్రోహి పేరుతో.. స్మశాన వాటికకు పంపుతాడని ఈటెల గెలిచిన ఓడిన ఎవరికి లాభం లేదు

గుజరాత్ తోనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయి, 2022 ఆగస్ట్ 15 తో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని, దీంతో కొత్త శకానికి నాంది అని కేసీఆర్.. ఎన్నికలకు వెళ్తారు.

మోడీ డైరెక్షన్ లో కేసీఆర్ గుజరాత్ ఎన్నికలతో కలిసి మిందస్తూ ఎన్నికలలో వెళ్తారని, రాష్ట్రంలో బిజేపి ని బలోపేతం చేసే.. కుట్ర జరుగుతోంది.

ఇప్పుడే ముందస్తు ఎన్నికలు అంటే అంటే తన పార్టీలో మరింత గందరగోళం వస్తదని కేసీఆర్ చెప్పడం లేదు.
ప్రతి నియోజక వర్గంలో నాయకులకు టికెట్ల ఇచ్చే పరిస్తితి లేదు కాబట్టి వారిని ముందస్తుగానే అలర్ట్ కాకుండా ఈ డ్రామా ఆడుతున్నడు. ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్ ను ఎవరు అడిగారని ముందస్తు ఎన్నికల విషయం ఎందుకు మాట్లాదుతున్నారు.
మరో రెండేళ్లు నా సర్కార్ అధికారంలో ఉంటుందని చెప్పుకోవడం కోసమే ఈ ముందస్తు ఉండదని చెప్పడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు.

విజయ గర్జన సభ ఎందుకు పెడ్తున్నాడు, రాష్ట్రంలో ఏం అభివృద్ధి, సంక్షేమం సాధించాడని విజయ ఘర్జన సభ.

తెలంగాణలో ఎంపీలు 16 గెలుస్తం, కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్ అనడం దేనికి సంకేతం.

టీఆరెఎస్ మ్యానిఫెస్టోలో.. దళిత, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్త అని వుంది, దళితలు, సీఎం పదవి కావాలని అడగలేదు. దళిత సీఎం అని ముడేకరాల భూమి ఇస్తా అని కేసీఆర్.. మోసం చేసిండు.

దళిత బంధు కూడా అడగలేదు.. వాళ్లు అడిగింది a,b,c,d వర్గీకరణ అది ఇవ్వలేదు. కేసీఆర్ ఆర్ ఇన్నిసార్లు ప్రధానికి కలిశారు కదా ఎప్పుడైనా ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ గురించి ప్రధాన మోడీని ఆడిగారా?  కేసీఆర్..దళిత ద్రోహి .

కేసీఆర్ సొంత పార్టీ లోనే దళితులకు ప్రాధాన్యత లేదు. పార్టీ అధ్యక్ష పదవీ కోసం.. కేసీఆర్ నామినేషన్ వేసే సమయంలో.. ఒక్క దళితుడు కూడా లేరు
నిన్న వేదికపై కూడా కేసీఆర్ పక్కన దళలితున్ని కూర్చోబెట్టుకొలేదు.

*దళిత ద్రోహి నాయకత్వంలో.. మరో దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింలు జాయిన్ అవుతున్నాడు.

యూపీ ఎన్నికల్లో బీజేపీ కి కేసీఆర్ సహకారం ఉంటుంది, దాని వెనక అంతర్గత ఒప్పందం జరిగింది.  కేసీఆర్ పై కేసులు, దాడులు జరగకుండ ఒప్పందం జరిగింది.

గుజరాత్ ఎన్నికల సమయానికి తెలంగాణ సర్కారును సర్కార్ ను కేసీఆర్ రద్దు చేస్తాడు.  సర్కార్ ను నడపాల్సిన సమయంలో పార్టీ పై కేసీఆర్ దృష్టి పెట్టడం ఏంటి? టిఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికల కోసమేనని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *