రేపు యాదాద్రి పనులు పరిశీలించనున్న సిఎం

రేపు (మంగళవారం, 19 అక్టోబర్) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు యాదాద్రి పర్యటనకు వెళుతున్నారు.   ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు  పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఆయన ఈ పర్యటన జరుపుతున్నారు.   ఆలయం నిర్మాణపు పనులను ఆయన అధికారులతో కలసి మరోసారి సిఎం కెసిఆర్ పరిశీలిస్తారు. యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ముఖ్యమంత్రి  ప్రకటించాల్సి ఉంది. ఈ ముహూర్తాన్ని  ఇప్పటికే చినజీయర్ స్వామివారు నిర్ణయించి వున్నారని, అనువయిన సమయం రాగానే  యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.
పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సిఎం కెసిఆర్ ప్రకటించనున్నారు.

ప్రపంచంలోనే సుప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా  యాదాద్రిని తీర్చిదిద్దే పనులు దాదాపు పూర్తయ్యాయి.  ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత సంతరించుకునే విధంగా నిర్మాణాలు జరిగాయి..ప్రెసిడెన్షియల్ సూట్,వివిఐపి 13 విల్లాలు పూర్తువుతున్నాయి.
భక్తుల సౌకర్యార్థం పుష్కరిణి,కళ్యాణకట్ట కూడా పున్నిర్మాణమయ్యాయి.
 యాదాద్రి పరిసర ప్రాంతాలు అంత పచ్చదనంతో పరిఢవిల్లేలా ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చి  దిద్దుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *