రేపు (మంగళవారం, 19 అక్టోబర్) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు యాదాద్రి పర్యటనకు వెళుతున్నారు. ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఆయన ఈ పర్యటన జరుపుతున్నారు. ఆలయం నిర్మాణపు పనులను ఆయన అధికారులతో కలసి మరోసారి సిఎం కెసిఆర్ పరిశీలిస్తారు. యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ముఖ్యమంత్రి ప్రకటించాల్సి ఉంది. ఈ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామివారు నిర్ణయించి వున్నారని, అనువయిన సమయం రాగానే యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.
పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సిఎం కెసిఆర్ ప్రకటించనున్నారు.