నదీజలాల విషయంలో ప్రాజక్టులను కేంద్ర పరిధిలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.
ఈ రోజు అసెంబ్లీ వానకాల సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ హామీ ఇచ్చారు. నదీజలాలవివాదంలో ముఖ్యమంత్రి అన్నిపక్షాలను కలుపుకుని ఢిల్లీ వెళ్లాలని ప్రతిపక్షాలు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు కెసిఆర్ దీనికి అంగీకరించారు.
శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. గత నెల 24 నుంచి 8వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు.
మొత్తంగా 7 రోజుల పాటు సభ జరిగింది . 27 ప్రశ్నలకు సమాధానం సభ ఇచ్చింది. 37 గంటల 5 నిమిషాలు సభ జరిగింది. 7 బిల్లులు చర్చకు వచ్చాయి. 6 అంశాల మీద లఘు చర్చలు జరిపారు. బిసి కులాల జనగణన పై అసెంబ్లీ లో తీర్మానం ఆమోదించింది.