రిజర్వేషన్ మద్యం షాపులు వస్తున్నాయ్

తెలంగాణ  ప్రభుత్వం మద్యం దుకాణాలలో  గౌడ్ లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని గతం లో నిర్ణయించారు. సెప్టెంబర్ 17 న జరిగిన క్యాబినెట్ లో 30 శాతం రిజర్వేషన్లను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇపుడు 2021-22 సంవత్సరపు షాపుల కేటాయింపు చేస్తున్నందున రిజర్వేషన్లను అమలుచేసేందుకు నిర్ణయించారు.  దీని ప్రకారం జిల్లాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని అబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. నవంబర్​లో మద్యం దుకాణాల టెండర్లను ఫైనల్​ చేయాల్సి ఉంది.

అప్లికేషన్​ ఫీజు రూ. 2 లక్షలు

టెండర్లకు అప్లికేషన్​ ఫీజును పెంచడం లేదు.
దరఖాస్తు ధర పెంచితే తక్కువ టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు నివేదించారు. దీంతో ఈసారి కూడా పాత ధరనే వర్తింపచేయనున్నారు. 2019లోనే అప్లికేషన్​ ఫీజును రూ. 1లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచారు.

తెలంగాణలో లిక్కర్ షాపుల ఏర్పాటుకు సంబంధించి నాన్ రిఫండబుల్ అఫ్లికేషన్ ఫీజు  2017లో రు. 50,000 లనుంచి రు. 1 లక్ష చేశారు. అపుడు కేవలం అప్లికేషన్ పీజువల్లే ప్రభుత్వానికి రు. 400 కోట్ల రాబడి వచ్చింది.  ఆయేడాది 41,000 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత కొత్త రెండేళ్ల ఎక్సయిజ్ పాలసీ2019-21 కోసం  2019 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది.ఈ పాలసీ ప్రకారం అప్లికేషన్ ఫీజును రు.1 లక్ష నుంచి రు.2 లక్షల కు పెంచారు.

ఈ ఏడాది నవంబర్ నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలులోకి వస్తుంది. ఇలాగే కొత్త షాపుల, అంటే రిజర్వేషన్ షాపులు కూడా  అమలులోకి వచ్చింది. లిక్కర్ పాలసీ రెండేళ్లకొకసారి ప్రకటిస్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *