తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాలలో గౌడ్ లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని గతం లో నిర్ణయించారు. సెప్టెంబర్ 17 న జరిగిన క్యాబినెట్ లో 30 శాతం రిజర్వేషన్లను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇపుడు 2021-22 సంవత్సరపు షాపుల కేటాయింపు చేస్తున్నందున రిజర్వేషన్లను అమలుచేసేందుకు నిర్ణయించారు. దీని ప్రకారం జిల్లాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని అబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. నవంబర్లో మద్యం దుకాణాల టెండర్లను ఫైనల్ చేయాల్సి ఉంది.
అప్లికేషన్ ఫీజు రూ. 2 లక్షలు
టెండర్లకు అప్లికేషన్ ఫీజును పెంచడం లేదు.
దరఖాస్తు ధర పెంచితే తక్కువ టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు నివేదించారు. దీంతో ఈసారి కూడా పాత ధరనే వర్తింపచేయనున్నారు. 2019లోనే అప్లికేషన్ ఫీజును రూ. 1లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచారు.
తెలంగాణలో లిక్కర్ షాపుల ఏర్పాటుకు సంబంధించి నాన్ రిఫండబుల్ అఫ్లికేషన్ ఫీజు 2017లో రు. 50,000 లనుంచి రు. 1 లక్ష చేశారు. అపుడు కేవలం అప్లికేషన్ పీజువల్లే ప్రభుత్వానికి రు. 400 కోట్ల రాబడి వచ్చింది. ఆయేడాది 41,000 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత కొత్త రెండేళ్ల ఎక్సయిజ్ పాలసీ2019-21 కోసం 2019 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది.ఈ పాలసీ ప్రకారం అప్లికేషన్ ఫీజును రు.1 లక్ష నుంచి రు.2 లక్షల కు పెంచారు.
ఈ ఏడాది నవంబర్ నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలులోకి వస్తుంది. ఇలాగే కొత్త షాపుల, అంటే రిజర్వేషన్ షాపులు కూడా అమలులోకి వచ్చింది. లిక్కర్ పాలసీ రెండేళ్లకొకసారి ప్రకటిస్తారు.