హుజూరాబాద్ లో నిరుద్యోగుల నామినేషన్లు తీసుకోవడంలేదు: షర్మిల ధ్వజం

 

హుజూరాబాద్ లో ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.

ఎన్ని రకాల కారణాలు చుపాలో అన్ని చూపిస్తున్నారని, ఆన్లైన్ నుంచి డౌన్ లోడ్ తీసుకున్న ఫామ్ లు తీసుకోవడం లేదని, ఫిజికల్ గా తీసుకున్న ఫామ్ లు మాత్రమే అనుమతి అంటున్నారని ఆమె ఈ రోజు తెలిపారు. ఆమె పోలీసుల మీద, రిటర్నింగ్ అధికారి మీద తీవ్రమయిన ఆరోపణలు చేశారు.  ఉద్యోగాలు లేనందుకు నిరసనగా హుజూరాబాద్ నిరుద్యోగులు నామిషేన్లు వేయాలని పిలుపునిచ్చా. దీనికి వందలాది మంది స్పందించారు.అయితే, వారి నామినేషన్లను రిటర్నింగ్ స్వీకరించడంలేదు, నామినేషన్ వేసేందుకు వచ్చే వారినిపోలీసులుఅరెస్టు చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు. రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

ఆమె ఇంకా ఏమిచెప్పారంటే…

నామినేషన్లు వేయాలని ప్రయత్నం చేస్తే అరెస్టులు. పెద్ద పార్టీ లకు మాత్రం ఎలాంటి అడ్డంకులు లేవు. ఇండిపెండెంట్ ల నామినేషన్లు స్వీకరించడానికి సుముఖంగా లేరు. మా పిలుపు తో వందల మంది నామినేషన్లు వేయడానికి ముందుకు వచ్చారు. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు

పోలీసులు కేసీఆర్ కి తొత్తులుగా మారారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేసీఆర్ కి అమ్ముడు పోయారు. నిజామాబాద్ లో ఓడిపోయినట్లు ఒడిపోతమని కేసీఆర్ భయపడుతున్నారు

నిరుద్యోగుల ఓట్లు పడవని కేసీఆర్ కి బయం. నామినేషన్లు వేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. నిరుద్యోగుల్లో నిరసన ఉంది. ఆత్మహత్యలు జరుగుతుంటే కేసీఆర్ కి పట్టింపు లేదు. నిరసన తెలపాలని అనుకోవడం తప్పు ఎలా అవుతంది? 7 వేళ ఫీల్డ్ అసిస్టెంట్ ల జీవితాలు రోడ్డున పడేశారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.హుజూరాబాద్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ సరిగా జరగడం లేదు. రేపు ఎన్నికల మీద కూడా అనుమానం ఉంది

అధికార పార్టీ కి అనుకూలంగా రిటర్నింగ్ అధికారి వ్యవహరిస్తున్నాడు. ఆయనను బదిలీ చేయాలి. డబుల్ డోస్ వ్యాక్సిన్ తప్పని సరి అని ముందే ఎందుకు చెప్పలేదు. నామినేషన్ల గడువు పెంచాలి అని డిమాండ్

*అవసరం అయితే ఈ అంశం పై కోర్టు కి వెళ్తాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *