క్షమించండి, కొద్ది సేపు అంతా తల దించుకోవాలి…

ఎపుడైనా ఇస్రో (ISRO) వాళ్లు రాకెట్ నో, ఉపగ్రహాన్నో విజయవంతంగా ప్రయోగించినపుడు టివిలో  ఆ సంబరాన్ని చూసి గర్వపడుతుంటాం.  ఇది ఎపుడో ఒకసారి  జరిగే పండగ.

అయితే, మనం రోజూ తిలదించుకునేలా చేసే విషయాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఇపుడుడాలోచించాలని యునెస్కో చెబుతూ ఉంది. లేక పోతే, భవిష్యత్తు పాడవుతుందని హెచ్చరిస్తూ ఉంది.

భారతదేశంలో పాఠశాలల మీద ‘No Teacher, No Class: State of the Education Report for India 2021′ నిన్న విడుదల చేసింది. నిన్ననే ఈ రిపోర్టు విడుదల చేయడానికి కారణం, అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం’ కావడం. ఈ రిపోర్టు పాతాళంలో ఉన్న భారత విద్యావ్యవస్థ మన కళ్ల ముందు నిలబెట్టింది. ముఖ్యంగా దేశం గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అంత సీరియస్ గా తీసుకోవడం లేదు.

1994 నుంచి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని క్రమం తప్పకుండా జరుపుకుంటున్నాం. అంతేకాదు, మనకు భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం కూడా ఒక ఉపాధ్యాయ దినోత్సవం. ఈ రెండు దినాలను ఎందుకు జరుపుకుంటారంటే, ఉపాధ్యాయ వృత్తి గౌరవించాలని, ఉపాధ్యాయుడి హక్కులను గౌరవించాలని, ఉపాధ్యాయుడి సమస్యలను పరిష్కరించాలని,ఉపాధ్యాయుడి అవసరాన్ని గుర్తించాలని చెప్పేందుకే.

అయితే, భారత దేశంలో ఇది జరగడం లేదని యునెస్కో రిపోర్టు వెల్లడించింది. ఎందుకంటే, పాఠశాలల్లో ప్రమాణాల్లో లేవు, టీచర్లకు సరైయినఅర్హతలు లేవు. చాలా పాఠశాలల్లో టీచర్లు వేకెన్సీలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణలో 37,204 టీచర్ల అవసరం ఉంది. ఆంధ్రలో 27,398 మంది టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని రిపోర్టు వెల్లడించింది.

ఎందుకంటే, ఈ రిపోర్టు ప్రకారం  భారతదేశంలో

  1. లక్ష పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగానే ఉంటున్నాయి. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. మధ్య ప్రదేశ్ అత్యధికంగా 21 వేల  సింగిల్ టీచర్ పాఠశాలలున్నాయి.
  2.  దేశంలోని మొత్తం ఉపాధ్యాయ పోస్టులలో 19 శాతం అంటే 11.6 లక్షల టీచర్లపోస్టులు ఖాళీ గా ఉన్నాయి
  3.  ప్రీప్రైమరీ స్థాయిలో 7.7 శాతం, ప్రైమరీ స్థాయిలో 4.6 శాతం,అప్పర్ ప్రైమరీ స్థాయిలో3.3 శాతం టీచర్లు ఉపాధ్యాయ అర్హతల్లేవు
  4.  ఒక లక్ష కు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్న రాష్ట్రాలు: ఉత్తర ప్రదేశ్ (3.3 లక్షలు), బీహార్ (2.2) పశ్చిమబెంగాల్ (1.1). టీచర్లు ఖాళీల విషయంలో ఈ మూడింటిని  అధ్వాన్నపు రాష్ట్రాలుగా నిర్ణయించారు.
  5. టీచర్ల ఖాలీలు ఎక్కుగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. గ్రామీణప్రాంతాలలో విద్య గురించి మనం అంత సీరియస్గా లేమని అర్థం. బీహార్ లోని ఖాలీలలో 89  శాతం గ్రామీణ ప్రాంతాలవే.
  6. తెలంగాణలోని 42,335 పాఠశాలల్లో6,678  పాఠశాలు సింగిల్ టీచర్ పాఠశాలలే.అంటే 16 శాతం.
  7. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించి తెలంగాణలో 72 శాతం గ్రామీణ ప్రాంతాల పాఠశాలలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో 37,204 టీచర్ల అవసరం ఉంది.
  8. ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే63,621 పాఠశాలల్లో9,160  పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూళ్లు. 91 గ్రామీణ స్కూళ్లలో ఖాళీలున్నాయి. రాష్ట్రంలో 27,398 మంది (41 శాతం) టీచర్ల అవసరం ఉంది.
  9. జాతీయ స్థాయిలో  15,51,000 పాఠశాలలుంటాే 1,10,971 సింగిల్ టీచర్ స్కూళ్లు.మొత్తం గ్రామీణ స్కూళ్లలో 89 శాతం స్కూళ్లలో టీచర్లు లేరు దేశమంతా 11,16,846 మంది టీచర్ల (69 శాతం) అవసరం ఉంది.
  10.  గ్రాస్ ఎన్ రోల్ మెంటు రేషియో (GER)2001 (81.6 శాతం) నుంచి 2019-20 నాటికి (93.03 శాతం) బాగా పెరిగిన, చివరకు ప్రాథమిక స్కూళ్లలో మిగులుతున్నది  74.6 శాతమే.
  11. ఈ సర్వేలో తేలిన మరొక షాకింగ్ విషయమేమింటే తాము చదువుతున్న క్లాస్ స్థాయి ప్రమాణాలు విద్యార్థుల్లో కనిపించకపోవడం.

విద్యార్థల టీచర్లు ప్రభావితం చేసినంతగా మరొకరెవరూ చేయలేదు. అందువల్ల టీచర్ల్ ఉద్యోగాన్ని, ఖాళీలను, పాఠశాలను పటిష్టం చేయాలని యునెస్కో రిపోర్టు చెబుతూ ఉంది. తమని టీచర్లు ఎలా ప్రభావితం చేశారో నోబెల్ బహుమతి గ్రహీలు చెబుతున్నారో ఇక్కడ వినండి.

 

https://www.facebook.com/watch/?v=1919290264830341&ref=sharing

 

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/world-teahers-day-october-5/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *