ఆనవాళ్ళు లేకుండా లూకేఫె నేలమట్టం చేస్తారా?

* ఆనవాళ్ళు లేకుండా నేలమట్టం చేసిన లూకేఫ్ స్థానంలో మరో లూకేఫ్ ను పునర్నిర్మాణం చేయాలి

*లూకేఫె కూల్చివేతకు పై విచారణ జరిపించాలి.

హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టరేట్ ఎడమ వైపు ప్రవేశ ద్వారము కు దగ్గర గల “లూకేఫె “నిర్మాణాన్ని ఉన్నఫలంగా నేలమట్టం చేసిన విషయం పై ఉన్నతాధికారుల  పారదర్శక విచారణ జరిపించి కారకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ,కూల్చివేతకు గల కారణాలను వెల్లడి చేయాలని వరంగల్ మహానగర పాలక సంస్థ కమీషనర్ ను వికలాంగుల జాయింట్ యాకక్షన్ కమిటి-వరంగల్ కోరింది.

నేల మట్టం చేసిన లూకేఫ్ ను అదే స్థలంలో పునర్నిర్మించి వికలాంగులకు లేదా మరే నిరుపేద వర్గానికైనా జీవనోపాధి కల్పించాలనే నినాదాలతో కమిటీ  నిరసన చేపట్టింది. అనంతరం కార్యాలయంలో కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ నిరసనలో వి-జాక్ కన్వీనర్ నల్లెల్ల రాజయ్య మరియు కో-కన్వీనర్లైన భీమవరపు ధనుంజయ్ కుమార్ ,కోండ్ర సత్తయ్య, గై సతీష్ ,మరియు సయ్యద్ అసద్ తదితరులు పాల్గేన్నారు.

ఈ సందర్భంగా వి.జాక్ కన్వీనర్ నల్లెల్ల రాజయ్య మాట్లాడుతూ వరంగల్ మహానగర పాలక సంస్థ సహకారంతో ‘లూ కేఫె’ అనే స్వచ్ఛంద సంస్థ సమాజంలోని అట్టడుగు వర్గాలకు తమ వంతు సాయమందించే నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలోఒక్కొక్కటి సుమారు ఇరువై ఐదు లక్షల వ్యయంతో ఐదు లూకేఫ్ సెంటర్లను నిర్మించింది.

వాటిని నిట్ కాలేజి సెంటర్లో.అంబేడ్కర్ సెంటర్ దగ్గర,ఖిలా వరంగల్ లోనిర్మించి ఇవ్వగా నగర పాలక సంస్థ వికలాంగులు ,పారిశుధ్య కార్మికులు,థర్డ్ జండర్ వాళ్ళలో అర్హులైన వారిని గుర్తించి జిల్లా కలెక్టరేట్ లోని లూకేఫ్ సెంటర్ ను థర్డ్ జండర్ వాళ్ళగప్పగించింది.

థర్డ్ జండర్ వారంరోజుల పాటైనా లూకేఫ్ ను నిర్వహించక వదిలేసి పోయినారు.

వాళ్ళు వదిలేసిపోయినంక సంబంధిత అధికారులు మరో వర్గానికి కేటాయించినా జీవనోపాధి గడిచిపోతుండేది. నిర్లక్ష్యం కారణంగా  ఈ లూకేఫ్ నేలమట్టం చేయడం జరిగింది.

కాబట్టి మన రా ష్ట్ర ప్రభుత్వం అట్టడుగు నిరుపేదల అభివృద్ధికి ఇతోధిక సాయమందించడంలో భాగంగా చేపట్టిన పథకాలను ప్రజల చేరువలోకి తీసుకరావాలే గాని కూల్చివేతలు,కాల్చివేతలకు పాల్పడరాదనే సోయినికలిగి వుండాలని వి-జాక్ గా కోరాల్సి రావడం విచారకరమన్నారు.

సహృదయులైన కమీషనర్ వెంటనే స్పందించి హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో ఆనవాళ్ళు లేకుండా ఇరువై లక్షల విలువగలిగిన లూకేఫ్ నేలమట్టమైన దారుణ సంఘటనపై  విచారణ జరిపించి కూల్చివేతకు  కారకులైన అధికార్లపై చట్ట పరమైన చర్యలు గైకొనాలని కమిటీ కోరింది

అలాగే  జీవనోపాధి కల్పించేలా నేలమట్టమైన లూకేఫ్ స్థానంలోనే మరో లూకేఫ్ నిర్మాణం చేపట్టాలని వి-జాక్ పక్షాన డిమాండ్ చేసింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *