శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబరు 7 నుండి 15వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అక్టోబరు 7వ తేదీ గురువారం సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుటాయి.

శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో వాహనసేవలు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తామని, గరుడసేవ మాత్రం రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు జరుగుతుంది.

ఈసారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తుండడం వలన స్వర్ణరథం, రథోత్సవం ఉండవు, వీటికి బదులు సర్వభూపాల వాహనసేవ జరుగుతుంది

ఈ నెల 15వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు భక్తితో ఆసక్తిగా ఎదురు చూస్తారు.

ఈ ఏడాది కూడా కోవిడ్-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారూ.

స్వామివారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆగమోక్తంగా నిర్వహించే కార్యక్రమాలు యథాతథంగా జరుగుతాయి.

భక్తులు ఈ వేడుకలు చూడటం కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఎస్వీబీసీ క్లీన్ఫీడ్ ద్వారా ఇతర ఛానళ్లలో కూడా బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలు చేపట్టారు.

ఆగమపండితుల సలహాలు, సూచనల మేరకు ఈసారి స్వామివారి చక్రస్నానం ఆలయంలోని ఐన మహల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నరు.

దర్శన టికెట్లు ఉన్నభక్తులు మాత్రమే తిరుమలకు రావాలని విజ్ఞప్తి : కోవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా దర్శన టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు వ్యాక్సినేషన్ పూర్తి అయిన సర్టిఫికెట్ గానీ, దర్శనానికి మూడు రోజుల ముందు ఆర్టిపిసిఆర్ పరీక్ష చేయించుకుని తీసుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు.

ముఖ్యమంత్రి  ప్రారంభోత్సవాలు : ఈ నెల 11వ తేదీ గరుడసేవ రోజున సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు చేస్తారని ఛైర్మన్ తెలిపారు.

అక్టోబరు 11న తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి పాత బ్లాక్లో తాత్కాలికంగా రూ.25 కోట్లతో వ్యయంతో నిర్మించిన చిన్నపిల్లల పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి ప్రారంభం. అలిపిరి పాదాల మండపం వద్ద చెన్నైకి చెందిన దాత రూ.15కోట్ల విరాళంతో నిర్మించిన గోమందిరం ప్రారంభం.

ఇందులో గోప్రదక్షిణ, గోతులాభారం, గోవు ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేలా ఏర్పాట్లు చేపట్టారు. రూ.25 కోట్ల వ్యయంతో దాత పునఃనిర్మించిన అలిపిరి నుంచి తిరుమల నడకదారి పైకప్పు ప్రారంభం. అక్టోబరు 12న తిరుమలలో ఇండియా సిమెంట్స్ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందిపోటు ప్రారంభం.

ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్ల ప్రసారాలు ప్రారంభం. కర్ణాటక ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *