ఈ బ్రహ్మోత్సవాలలో TTD కొత్త ప్రయోగం

వెనుకబడిన పేద వర్గాల భక్తులకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం కల్పించే ప్రయోగం టీటీడీ ఈ సారి చేపడుతోంది.

రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి రోజుకు సుమారు వెయ్యి మంది చొప్పున వెనుకబడిన పేద వర్గాల భక్తులకు అక్టోబరు 7 నుండి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్టు ఛైర్మన్ వెల్లడించారు.

వీరికి తిరుమల శ్రీవారి దర్శనంతోపాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేయిస్తామన్నారు.

సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకు, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో టిటిడి మొదటి విడతలో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆలయాలు నిర్మించామన్నారు.

ఈ ఆలయాలు నిర్మించిన వెనుకబడిన ప్రాంతాల నుండి పేదవర్గాల వారిని బ్రహ్మోత్సవాల సమయంలో ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయించడం జరుగుతుందన్నారు.

ఒక్కో జిల్లా నుండి 10 బస్సులు ఏర్పాటుచేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి దర్శనం చేయించి తిరిగి వారి ప్రాంతాలకు తీసుకెళతామని చెప్పారు.

తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు ఏర్పాటు చేశామన్నారు.

దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు మార్గమధ్యంలో స్థానిక దాతల సహకారంతో ఆహార పానీయాలు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *