చెత్త బండ్లకు వైసిపి రంగులేమిటి, ప్రధాని బొమ్మ ఉండాలిగా: సోము వీర్రాజు

వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలకు రంగు పిచ్చి పట్టుకుంది. ఆ మధ్య  కొన్నికోట్ల రుపాయలు ఖర్చు చేసి గ్రామాలలో ప్రభుత్వ భవనాలకు రంగులేశారు. తర్వాత హైకోర్టు చివాట్లు పెట్టడంతో   మరొకొన్ని  కోట్లు ఖర్చు చేసి ఆ రంగులను చేరిపేశారు.

ఈసారి మునిసిపాలిటి చెత్త బండ్లను ఎంచుకుని  పార్టీ రంగు లేశారు. రంగువేస్తున్నది చెత్త బండ్లు కాబట్టి ఎవరూ పట్టించుకోరని అనుకున్నారా?

బండ్ల బ్యాక్ గ్రౌండ్ లో వైసిపి జండారంగులేసి,  స్వచ్ఛభారత్ లోగో, గాంధీ తాత కళ్లదాలు వేసుకున్నారు. అయితే,   ఇది రాష్ట్ర బిజెపి సోము వీర్రాజు కంట పడింది.ఆయన అభ్యంతరం తెలిపారు. ఎందుకంటే, ఈ బండ్లను కేంద్రం ఇస్తున్న స్వచ్ఛబారత్ నిధులనుంచి కొనుగోలు చేశారు.

ఈరోజు ఆయన విజయవాడ మునిసిపల్ స్టేడియానికి వచ్చి ఈ బళ్లను పరిశీలించారు. వీటి మీద వైసిపి రంగులేమిటి ఉండాల్సింది ప్రధాని బొమ్మకదా అని ఆయన ఆశ్చర్య పోయారు. స్వచ్ఛ భారత్ పథకానికి ప్రధాని మోదీ బ్రాండ్ ఎంబాసిడర్ అయినందున ఈ చెత్త బండ్ల మీద ఆయన బొమ్మ వేయాలని బిజెపి అధ్యక్షుడు చేస్తున్నారు.

స్వచ్చ భారత్ పధకంలో పధకంలో భాగంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులతో పొడి చెత్త, తడిచెత్త సేకరణ కు వాహనాలు కొన్నారు. అయితే వాటికి  వైసిపి ప్రభుత్వం పార్టీ రంగులేసి ముస్తాబు చేశారు.

ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులు తొలగించాలని న్యాయ స్ధానాలు ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంటే ప్రభుత్వం ఆదేశాలు పట్టించు కోవడం మాట దేవుడెరుక తిరిగి కేంద్రం నిధులు కొనుగోలు చేసిన వాహనాలకు పార్టీ రంగులు వేయడాన్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సీరియస్ గా తీసుకున్నారు.

గాందీ జయంతి సందర్భంగా మంజూరు చేస్తున్న వాహనాలను ఎపి బిజెపి ఆధ్యక్షులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా  సోమువీర్రాజు మీడియా తో మాట్లాడారు.

ఆయన ఏమన్నారంటే…

వైసిపి మంత్రులు తిట్టడంలో దిట్టలు తప్ప అభివృద్ది గురించి వారికి తెలిసింది శూన్యం.  కేంద్రం ఇస్తున్న పధకంలో కొనుగోలు చేసిన వాహనాలకు ‘స్వచ్చ భారత్’  ప్రధాని మోదీ  చిత్రాలను ఏర్పాటు చేయాలని, క్లియర్ గా  కేంద్రం నిధులు తో వచ్చిన వాహనాలుగా ప్రజలకు తెలిసేవిధంగా వాహనాల రూపం ఉండాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

స్వచ్ఛ్ భారత్ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహాణపై బీజేపీ ఈ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.
క్లీన్ ఏపీలో భాగంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలను పరిశీలించిన బీజేపీ ఏపీ అధ్యక్షడు సోము వీర్రాజు వాహనాలు పై రంగులు తో పాటు కేంద్రం ప్రభుత్వం పేరు ఎక్కడా ఉచ్చరించని విధానం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వాహానాలపై జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు వేయడంపై ఆయన ధ్వజెమెత్తారు.

రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ వెళ్లి డబుల్ స్టిక్కర్ వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు.

స్వచ్ఛ భారత్ కింద కేంద్రం రూ. 1015 కోట్ల నిధులను రాష్ట్రానికి కేటాయించిందని సోమువీర్రాజు వివరించారు. ఈ విధంగా వేల కోట్లు స్వచ్చభారత్ మిషన్ ద్వారా అందించడం జరుగుతోందన్నారు. ఈ చెత్త వాహానాలను ఇంత అందంగా తయారు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కూడా లేవు. ఇవన్నీ కేంద్ర నిధులే నన్నారు.

గ్రామ సచివాలయాలకు రంగులేసి కోర్టుతో ప్రభుత్వం చీవాట్లు తిన్నా వైసిపి ప్రభుత్వానికి బుద్దిరాలేదన్నారు.ఈ ప్రభుత్వానిది తోలుమందం.. పద్దతి మార్చుకోవడం లేదు. మోడీ ఫొటో లేకుండా వాహానాలు ప్రారంభిస్తారా..? అంటూ అధికార యంత్రాంగం పై విరుచుకుపడ్డారు. వెంటనే మోడీ ఫొటో వేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కేంద్ర నిధులు వస్తున్నాయని అయితే ఇక్కడ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం మినహా కేంద్రం నిధులు ఇస్తున్నట్లు నోరుకూడా మెదపరని వీర్రాజు అన్నారు ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదు.. కేవలం తిట్ల దండకంతో సరిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మీడియా ఇన్ ఛార్జి లక్ష్మీపతిరాజా, జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శులు ఆర్ముగం, భోగవల్లి శ్రీధర్, ఒబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు శివకుమార్ పట్నాయక్, బిజెపి నేతలు తోట శివనాగేశ్వరరావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *