ఎడతెరిపి లేని వర్షాలవల్ల శాసనసభ, మండలి సమావేశాలకు 3 రోజుల విరామం ప్రకటించారు.
తిరిగి అక్టోబర్ 1న ఉభయసభలు సమావేశం కానున్నయి.
గులాబ్ తుపాను, భారీ వర్షాల దృష్ట్యా సమావేశాలకు విరామం ప్రకటించారు.
అధికారులు, ఎమ్మెల్యేలు సహాయచర్యల్లో పాల్గొనాల్సినందున సభ్యుల విజ్ఞప్తి మేరకు సభాపతి, ప్రొటెం ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.