అమరావతి రాజధాని ఉద్యమానికి 650 రోజులు

అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం 650 రోజుల మైలు రాయిని చేరుకున్న సందర్భంగా అనంతవరం దీక్షా శిబిరం వద్ద బహుజన పొలికేక పేరుతో సభ నిర్వహించబడింది.

అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమాన్ని మరింత శక్తివంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను – ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల సమగ్రాభివృద్ధిపై బలంగా గళం వినిపించే లక్ష్యంతో అమరావతి బహుజన జేఏసీ నాయకులు, 25 ఏళ్ళ పాత్రికేయ అనుభవం ఉన్న మిత్రులు పోతుల బాలకోటయ్య గారు తన ఆధ్వర్యంలో “బికే కాలమ్” యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. దాని ఆవిష్కరణ అనంతవరం వేదికగా జరిగింది.

మోడీ ప్రభుత్వం తెచ్చిన రైతాంగ వ్యతిరేక, ఆహార భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తతంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో అంతర్భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

శ్రీ ఆలూరి రఘునాధరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆంధ్ర ప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక సమన్వయకర్త శ్రీ టి.లక్ష్మీనారాయణ, అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమ నేత శ్రీ వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు శ్రీ పోతుల బాలకోటయ్య, అమరావతి రైతు ఐక్యకార్యాచరణ కమిటీ కన్వీనర్ శ్రీ పువ్వాడ సుధాకర్, మహిళా జేఏసీ నాయకురాలు శ్రీమతి శిరీష, న్యాయవాది శ్రీ చిగురుపాటి రవీంద్రబాబు, మైనార్టీ నాయకులు శ్రీ ఫరూక్ షుబ్లీ, శ్రీ ఆలూరి యుగంధర్, తదితరులు ప్రసంగించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *