టిటిడి మార్కెటింగ్ గోడౌన్ కేంద్రంగా పురుగులు పట్టిన జీడిపప్పు సరఫరాలో భారీ గోల్ మాల్ జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
టీటీడీ కి జీడిపప్పు బెంగుళూుకు చెందిన హిందుస్థాన్ ముక్తా అనే సంస్థ జీడిపప్పు సరఫరా చేస్తుంటుంది. అవతవకలకు పాల్పడిన ఈ బెంగళూరు కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సంస్థ జనవరి 5 నుంచి ఇప్పటిదాకా 1.75 వేల కేజీల జీడిపప్పును సరఫరా చేేసింది. ఇందులోడుల జీడిపప్పు నాసిరకానిదని టిటిడి మార్కెటింగ్ అధికారులు తిప్పింపాపరు. టిటిడికి ఒక రకం సరుకు చూపించి మరొక నాసిరకం సరుకును సరఫరా చేసినట్లు అధికారులు కనుగొన్నారు.
టిటిడి గోడౌన్ లో రిజెక్ట్ చేసిన 10 లారీ లోడ్ల పురుగులు పట్టిన జీడిపప్పు వెనక్కి పంపారు. అయితే, కంపెనీ ఆదే సరుకును రీ ప్యాకింగ్ చేసి, లారీ నెంబర్ మార్చి మళ్ళీ టీటీడీ కి సరఫరా చేశారని ఆరోపిస్తూ, దీనికి సహకరించిన వారిపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కంపెనీ ఇంత మోసానికి ఒడి గట్టిందంటే అది ఇంటి దొంగల పనేనని ఆయన చెప్పారు. ఇంటి దొంగల ప్రమేయం లేకుండా ఇది సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఇంటి దొంగలను బయటపెట్టాల్సిన బాధ్యత టిటిడి విజిలెన్స్ అధికారుల మీద ఉంది.
టీటీడీ కి సరఫరా చేస్తున్న కోట్లాది రూపాయల ముడిసరుకుల నాణ్యతను(శానిటరీ ఇన్స్పెక్టర్ స్థాయి) డిప్యూటేషన్ అధికారులు పరిశీలించేందుకు తిరుపతి మార్కెటింగ్ గోడౌన్ నుంచి శాంపిల్ ను తిరుమల కొండకు పంపడాన్ని కూడా ఆయన తప్పుపంటారు. గోడౌన్ కొండ కింద, ల్యాబ్ కొండమీద ఉండటమేమిటని ఆయన అన్నారు.
అక్కడి ల్యాబ్ లో పరిశీలించిన తర్వాత సరుకులను అనుమతించడం వలన ఇలాంటి అక్రమాలకు అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు.
టీటీడీ కి సరఫరా చేస్తున్న ముడి సరుకుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు సీనియర్ అనలిస్ట్ పోస్ట్ ఉంది. అయితే ఇది ఖాళీగా ఉంది. దీనిని భర్తీ చేయాలని గత ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు సీనియర్ ఎనలిస్టును నియమించకపోవడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు
టీటీడీ కి సరఫరా చేస్తున్న ముడి సరుకుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించే ల్యాబ్ ను తిరుపతి మార్కెటింగ్ గోడౌన్లో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
టీటీడీ నిత్య అన్నదాన పథకానికి లడ్డు తయారీకి అనుబంధ ఆలయాలలో ప్రసాదాల తయారీకి కొనుగోలు చేస్తున్న ముడిసరుకుల నాణ్యత ప్రమాణాలపై ప్రతి నెల ఉన్నతాధికారుల తనిఖీలతో పాటు నిరంతరం క్వాలిటీ కంట్రోల్ వింగ్ పర్యవేక్షణ ఉండాలని ఆయన సూచించారు.
టీటీడీ కి 10 లోడ్ల పురుగులు పట్టిన జీడిపప్పు సరఫరా చేసిన కాంట్రాక్టర్ పై అందుకు సహకరించిన వారిపై విజిలెన్స్ ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.