నేటి ఫోటో వార్త: షర్మిలకు తెలంగాణ సెగ మొదలు

తెలంగాణ రాజకీయాలలోకి ప్రవేశించి ఇంతవరకు సాఫీ కధనడుపుతూ వస్తున్న వైఎస్ షర్మిలకు ఈ రోజు తొలి సారి పెద్ద ఆటంకం ఎదురయింది. హైదరాబాద్ బోడుప్పలో ఆమె ఈ రోజుటి మంగళవారం దీక్షను పోలీసులు అనుమతించలేదు. పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు దిక్కు తోచని పరిస్థితి సృష్టించారు. వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. దీనితో అక్కడ ఉద్రికత్త మొదలయింది. షర్మిళ అభిమానులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.

నిరుద్యోగుల తరఫున పోరాటమంటూ ఆమె ప్రతిమంగళవారం  ‘ఉద్యోగం రాక ఆత్మహత్య’ చేసుకున్న యువకుల ఇంటి వద్ద దీక్ష చేస్తున్నారు. ఈరోజు బోడుప్పల్ ఎంచుకున్నారు

బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‎లో నిరుద్యోగ దీక్షకు అనుమతి లేకున్నా దీక్షకు కూర్చోవడంతో పోలీసులు  వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ర్మిల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ విధానాలను ముఖ్యంగా నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ అనుసరిస్తున్న ధోరణిని విమర్శించారు. అదేవిధంగా తెలంగాణ ప్రతిపక్షపార్టీలను కూడా తీవ్రంగా దుయ్యబట్టారు. ఆమె ఏమన్నారంటే…

“నిరుద్యోగి ర‌వీంద్ర నాయ‌క్ ఉస్మానియా యూనివ‌ర్సిటీలో పీహెచ్ డీ చేసి కూడా ఆరు సంవ‌త్స‌రాలు నోటిఫికేష‌న్ల కోసం ఎదురు చూసి, నోటిఫికేష‌న్లు రాక అటు ప్రైవేటులోనూ ఉద్యోగం రాక ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.కేవ‌లం కేసీఆర్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ర‌వీంద్ర నాయ‌క్ ప్రాణాలు కోల్పోయాడు. కేసీఆర్ నోటిఫికేష‌న్లు ఇచ్చి ఉంటే ర‌వీంద్ర నాయ‌క్ కుటుంబం దిక్కులేనిదయ్యేది కాదు. ”

 

“రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ వంటి ప్ర‌తిప‌క్షాల‌తో పాటు పోలీసులు కూడా కేసీఆర్ కు తొత్తులుగా మారారు. మేం ప్ర‌తి మంగ‌ళ‌వారం నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తామ‌ని చెప్పాం. ఇప్ప‌టికీ 12 వారాలుగా దీక్ష చేస్తున్నాం.”

“ప్ర‌తి మంగ‌ళ‌వారం శాంతియుతంగా దీక్ష చేస్తున్నాం. మాకు మ‌ద్ద‌తుగా ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నారు. పొద్దున నుంచి మెతుకు అన్నం ముట్ట‌కుండా ప‌విత్రంగా దీక్ష చేస్తున్న‌ది నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు రావ‌డం కోసం.. కేసీఆర్ గారి మెడ‌లు వంచి నోటిఫికేష‌న్లు జారీ చేయ‌డం కోస‌మే.”

“మా పార్టీకి సంబంధించిన క‌నీసం పోస్ట‌ర్ల‌ను కూడా పోలీసులు పెట్ట‌నీయ‌డం లేదు.. కేసీఆర్ పోస్ట‌ర్లు మాత్ర‌మే ఉండాల‌ట‌. వేరే వాళ్ల‌వి పెట్ట‌కూడ‌ద‌ని చెబుతున్నారు.వేల మంది ప్ర‌జ‌లు మా చుట్టూ ఉంటే వారికి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డానికి కూడా పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌డం లేదు. పోలీసుల తీరుకు నిర‌స‌న‌గా మేం పోలీస్ స్టేష‌న్ లోనే కూర్చుని దీక్ష చేస్తాం”

షర్మిళను అదుపులోకి తీసుకున్నాక, ఆమెను పోలీస్ స్టేషన్ కు కాకుండా లోటస్ పాండ్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *