ఇపుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానాల జంబో బోర్డు హాస్యాస్పదంగా ఉందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తంగా 82 మంది సభ్యులున్న బోర్డు ఇది. చరిత్రలో ఇద్ద పెద్ద బోర్డు ఎపుడూ రాలేదు.ఈ బోర్డు సమావేశంలో కూర్చునే ఇతర అధికారులను కలిపితే, సుమారు 100 మంది అవుతారు. అంటే, టిటిడి బోర్డు చత్తీష్ గడ్, చండీగడ్, గోవా, ఢిల్లీ,హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్జండ్ వగైరా అసెంబ్లీ ల కంటే పెద్దదన్నమాట.
ప్రజలు, భక్తులు ఇలాంటి బోర్డు ఏర్పాటుచేస్తే ఏమనుకుంటారననే మర్యాదను కూడా పక్కన బెట్టి 81 మంది సభ్యులతో బోర్డు నియామించారు.
అయిన వాళ్లందరిని పట్టుకొచ్చి బోర్డులో కుర్చీ వేశారు. గతంలో బోర్డు అన్నా, చెయిర్మన్ అన్నా, ఎగ్జిక్యూటివ్ అఫీసర్అన్నా కొంత గౌరవం, ప్రతిష్ట ఉండినాయి. అవి క్రమంగా పోతున్న మాట నిజమే. అయితే, ఇపుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించిన జంబో బోర్డు తో అంతా పోయింది. ఈ బోర్డు ఎలా ఉండకూడదనేందుకు జగన్ నియమించిన బోర్డు ఉదాహరణ అనే విమర్శ వస్తూ ఉంది.
గత కొద్ది రోజులుగా తిరుమల దర్శనాలను డబ్బున్నోళ్ల పరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. పల్లె జనాలకు,పేదలెందరికో ఏడుకొండల వాడు ఇంటి దైవం. వాళ్లంతా బుద్దిపుట్టినపుడు అష్టకష్టాలు పడి తిరుమలకు వచ్చి, క్యూలో ఓపికగా వేచి ఆ అరక్షణం దర్శనం చేసుకుని వెళ్లతుంటారు. ఈ కష్టాలను మహద్భాగ్యంగా చెప్పుకుంటుంటారు. ఇలాంటి లక్షలాది మంది నిజమయిన భక్తులకు తిరుమలో చోటు లేకుండా పోతున్నది. గత రెండేళ్లుగా ఇది వేగం అందుకుంది. ఇక్కడ పైన చెప్పిన భక్తులకు ఆన్ల లైన్ బుకింగ్ అంటే ఏమిటో తెలియదు, స్లాట్ అంటే తెలియదు.విఐపి సిఫార్సు లేఖ అంటే అసలూ తెలియదు. కరోనాపేరుతో శ్రీవారు డబ్బున్నోళ్లవారయిపోయారు.
ఆన్ లైన్ లో బుకింగ్ లేకుండా స్లాట్ లేకుండా తిరుమల లోకి రాలేని పరిస్థితులొస్తున్నాయి. ఇక ముందు ఇలాంటి భక్తులు తిరుమలలో కాలు మోపలేరేమో. ఎందుకంటే, శ్రీవారికి బాగా కానుకలిచ్చే ధనిక భక్తులకు ప్రాముఖ్యం పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జగన్మహన్ రెడ్డి ప్రభుత్వం జంబో బోర్డు ప్రకటిచింది. ఇందులో 82 మంది సభ్యులు,ఎక్స్ ఆఫీసియో సభ్యులు, ప్రత్యేకాహ్వానితులు ఉన్నారు.టిటిడి బోర్డులో ఏదో ఒక పేరుతో కూర్చోవాలనుకునేది టిటిడిని వృద్ధి లోకి తెద్దాం, భక్తులకు సేవ చేద్దామని కాదు, టిటిడిలో మర్యాదల కోసమే. ప్రివిలేజెస్ కోసమే. అందుకే సభ్యత్వం కోసం లాబీయింగ్ చేసేంది.
దీని మీద రాజకీయ వ్యాఖ్యాత కందాళై మురళి చేసిన వ్యాఖ్యలు:
బోర్డు ప్రకటించిన ధోరణి చాలా బాధ్యతా రహితంగా ఉంది. నిజానికి గత బోర్డే చాలా పెద్దదిగా ఉంది. సమస్యలు చర్చిచేందుకు, పరిష్కరించేందుకు ఏమాత్రం పనికికాదు అనే విమర్శ ఉండింది. అపుడు 35 మంది సభ్యులు, ఆహ్వానితులు ఉండేవారు. దీని మీద చాలా విమర్శలొచ్చాయి.
ఇది సరైన విధానం కాదని గతంలో బోర్డు లో సభ్యులుగా ఉన్నవారు, సీనియర్ అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీటిని గాలి కొదిలేసింది. సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) బోర్డు 20 మంది కి మించి ఉండదు. కానీ సారి అది పట్టుదప్పి ఎటోపోయింది. ఇందులో 24 మంది సభ్యులు. చెయిర్మనతో కలిసి 25 మంది అవుతారు. వీరికి తోడుగా ప్రత్యేకాహ్వానితులని పేరు పెట్టి అయినవాళ్లందరిని దించేశారు.
అంతేకాదు, బోర్డు ను ప్రకటించిన తీరుకూడా నవ్వులాటగా ఉంది. బోర్డులో సభ్యులు 25 మంది మాత్రమేనని, మిగతా వారంతా వారి వారి రంగాలలో కాకలు తీరిన యోధులని వాళ్ల సేవలను వినియోగించుకునేందుకు వారిని ప్రత్యేకాహ్వానితులుగా బోర్డులోకి తీసుకున్నామని బోర్డు సభ్యుల పేర్లను ప్రకటిస్తూ చెయిర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు.
ఇంత మంది సభ్యులతో సమావేశం జరిపేందుకు తగిన వసతి కూడా లేదు. బోర్డు సభ్యులైనా, ప్రత్యేకాహ్వానితులయినా, ఎక్స్ అఫిషియోసభ్యులైన, టిటిడి సమావేశమంటే వీరంతా హాజరవుతారు. ఇంతమంది సమావేశం ఎక్కడ నిర్వహించాలని కూడా సమస్యే. ఇపుడున్న అన్నమయ్య భవన్ ఏమాత్రం సరిపోదు. బోర్డు ఎలా ఉందో చూడండి. ఛెయిర్మన్ ఒకరు. 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు.
బోర్డు సమావేశంలో 100 మంది
వీరంతా ఓటింగ్ ఉన్న సభ్యులు. వీళ్లు కాకాకుండా, 52 మందిని ఆహ్వానితులపేరుతో బోర్డులోకి తీసుకున్నారు. అంటే 82 మంది సభ్యులన్నమాట. మరి టిటిడి సమావేశం జరిగితే, ఈ 82 మందికే పరిమితమవుతుందా? వీళ్లకాకుండా సమావేశానికి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (JEO) తప్పనిసరిగా హాజరవుతారు. టిటిడిలో ఇపుడు జెయివో లు ముగ్గురున్నారు.
ఫైన్సాన్స కు సంబంధించిన అధికారి కూడా తప్పనిసరిగా వస్తారు. విజిలెన్స్ సెక్యూరిటీఅధికారి ఒకరుంటారు. చీఫ్ ఇంజనీర్ ఒకరు. మరొకరిద్దరు అధికారులు కూడాతప్పనిసరిగా వస్తారు.
అంటే 82 సభ్యులకు తోడు గా 8 మంది అధికారులు కూడాసమావేశానికి హాజరవుతారు.వీరికితోడు చెయిర్మన్ పర్సనల్ సెక్రెటరీ, ఎగ్జిక్యూటివ్ అధికారి పిఎస్ కూడా సమావేశంలో ఉంటారు. సమావేశం నిర్వహణకుమరొక అరేడు మంది డిప్యూటీ ఇవొలు, మినిట్స్ రాయడానికి మరొక ముగ్గురు ఎఇవొ లు ఉంటారు తోడయితే,దాదాపు సమావేశంలో నూరు మంది దాకా కూర్చుంటారు.
ఒక్కొక్క సమావేశంలో కనీసం 150 ఎజండా అంశాలుంటాయి. 35 మంది సభ్యుల బోర్డు ఉన్నపుడే సమావేశంలో చర్చే జరిగేదికాదు.అజండా ప్రవేశపెట్టడం ఒకే అనుకోవడం తప్ప మరొక చర్చ, సలహాలు, సూచనలు జరిగేవే కాదు. 150నుంచి 200 అజండా అంశాలున్నపుడు కూడా సమావేశాన్ని గంటా రెండు గంటల్లో ముగించుకుని వెళ్లిపోయే వారు. చర్చలెలాగూజరగవుకాబట్టి నూరు మందిఉంటే ఏముంది, రెండువందల మంది ఉంటే ఏముందిఅని ప్రభుత్వం భావించినట్లుంది. అందుకే బోర్డుని ఇలా పెంచేశారు అంశం.
టిటిడి బోర్డులతో వచ్చే సమస్య
ఇక మరొక ముఖ్యమయిన అంశం బోర్డుసభ్యుల తీరు తెన్నులు.వీళ్లెవరూ టిటిడి అభివృద్ధి చేద్దాం, టిటిడిలో సమస్యలేమున్నాయి, వాటిని ఎలాపరిష్కరిద్దాం అనే లక్ష్యంతో వీళ్లెవరూ సమావేశాలకు రారు. వీళ్లంతా వచ్చేది టిటిడి మర్యాదల కోసమే వస్తారు. ఏ సభ్యుడూ సమావేశానికి ఒక్కరూ రారు. సకుటుంబ సపరివారంతో వస్తారు. దర్శన మర్యాదలు కావాలంటారు. ఇలా వీళ్లనుంచి కనీసం వేయి మంది దర్శనానికి వచ్చే ముప్పు ఉంటుంది. ఇది నిజమయిన భక్తులకు ఎంత అసౌకర్యమో చూడండి.
ఇపుడున్న సభ్యులనుచూస్తే ఒక్కొక్కరు వంది మంది తక్కువకాకుండా తమ వాళ్లను వెనకేసుకొచ్చే రకం కాదనిపిస్తుంది. వీళ్లతో భక్తులకు ఒకవైపు సమస్యలు తీసుకువస్తూ, మరొక వైపు చెయిర్మన్, ఇవొ లు తిరునామలు ధరించి, సాంప్రదాయిక దుస్తులు ధరించి, ఉన్నట్లుండి శ్రీవారి భక్తులయిపోయి చేప్పే మాటలేమిటి? తమకు భక్తులే ముఖ్యం, భక్తుల సేవలు మెరుగుపర్చడాని మేం ఉన్నాం,అని. ఆచరణలో సాధారణ భక్తులకు చోటేలేదు, కరోనా నియమాలు సడలించాక తిరుమల ఏంజరుగుతున్నది? డబ్బులిచ్చిన వాళ్లకే పెద్ద పీట వేస్తున్నారు.
కరోనా సమయంలో కుటుంబ సభ్యులనుపోగొట్టుకున్నవాళ్లు, తీవ్రంగా కరోనాభారిన పడి బతికి బయటపడిన వాళ్లు, కొంత ఉపశమనం పొందేందుకు దేవుడిని దర్శనం చేసుకునేందుకు అవకాశమే లేకుడా చేశారు. తిరుమల శ్రీవారిని ఇపుడు డబ్బులోన్నళ్లకు, ఆన్ లైన్ టెక్నాలజీ తెలిసిన వాళ్లకే పరిమితం చేశారు.
దేవుడినినిజాయితీగా దర్శనం చేసుకుందామని వచ్చ సాధారణ పేద భక్తులకు దర్శనం అందుబాటులో లేకుండా పోయింది. వారెవరిరిక దర్శన భాగ్యం కాదుకదా, అలాంటివాళ్లని తిరుమల దాకా కాదు,అలిపరి దగ్గరినుంచే తరిమేసే పరిస్థితి ఉంది. ఇక్కడ జరుగున్న విషయం తెలియకుండా ఎవరైన పల్లెటూర్ల నుంచి దేవుని చూద్దామని అమాయకంగా వస్తే, వాళ్ళని గౌరవంగా చూసే పరిస్థితి ఇక్కడ లేనే లేదు. మీకు అనుమతి లేదు, స్లాట్ లేదు, అన్ లైన్ లో బుకింగ్ చేసుకోలేదని అక్కడి నుంచి సిబ్బంది తరిమేస్తారు. లేదంటే, ఎవరైనా విఐపి దగ్గిర నుంచి లేఖ ఉందా అని అడుగుతారు. లేఖ తెచ్చుకో, లేదంటే వెళ్లిపో అని తరిమేస్తారు.
ఇలా వ్యవహారం తయారుయినపుడు ప్రభుత్వం ఎలాంటి బోర్డును నియమించిందోచూడండి. ఈ బోర్డు ఏరంగా ప్రజలకు, భక్తులకు ఉపయోగపడుతుందో అర్థంకాదు. ఈ బోర్డు వేసి భక్తుల మనోభావాలతో ప్రభుత్వం చెలగాటమాడుతునట్లుంది తప్ప, టిటిడి సేవలను, భక్తులవసతులను మెరుగుపరిచే దృష్టితో వేసినట్లులేదు. బోర్డు ప్రకటించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. ప్రభుత్వం ఈ బోర్డు నియామకం మీద పునరాలోచన చేయాలి.