‘నిరాశలో ఆంధ్రా వృద్ధులు, వికలాంగులు , రు. 28 వేల పెన్షన్ లాస్’

‘సామాజిక పింఛన్లకు కోతపెట్టడానికే ఈ ముఖ్యమంత్రి GO NO 174 తీసుకొచ్చాడు.’

 

బీ.టీ.నాయుడు (టీడీపీ ఎమ్మెల్సీ)

ప్రతిపక్షనేతగా ఉన్నసమయంలో జగ్మోహన్ రెడ్డి చెప్పినమాటలు నమ్మినందుకు, నేడు ఆయన ముఖ్యమంత్రయ్యాక వృద్ధులు, దివ్యాంగు లు, వితంతువులకు తీరనిశోకాన్ని మిగిల్చాడు.

సామాజిక పింఛన్లపై ముఖ్యమంత్రి హోదాలో తొలిసంతకం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏటా రూ. 250చొప్పున పింఛన్లు పెంచుతానని చెప్పి, పింఛన్లను రూ.3వేలకు పెంచుతానన్న వాగ్ధానానికి తూట్లు పొడిచాడు.

బిటి నాయుడు,తెలుగు దేశం ఎమ్మెల్సీ

ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాటతప్పాడో, పింఛన్లను రూ.3వేలు ఎందుకు చేయలేకపోయాడో సమాధానంచెప్పాలి. పింఛన్లను కేవలం రూ.250మాత్రమే పెంచడంవల్ల రాష్ట్రంలోని ప్రతివృద్ధుడు, దివ్యాంగుడు, వితంతుమహిళ ఈ 28నెలలకాలంలో రూ.28వేలవరకు కోల్పోయారు.

పింఛన్లు పెంచడం మాటఅటుంచిన జగన్మోహన్ రెడ్డి, వాటికి ఎగనామం పెట్టడానికి ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. జీవోనెం 174 తో రాష్ట్ర వ్యాప్తంగా 2.25లక్షల పింఛన్లు తొలగించాడు.

అంతటితో ఆగకుండా ఏ నెల పింఛన్లు ఆ నెలలోనే తీసుకోవాలనే పనికిమాలిన నిబంధన తీసు కొచ్చాడు. ఆ నిబంధనతో దాదాపు లక్షన్నరమంది వరకు పింఛన్లు కోల్పోయే దుస్థితిఏర్పడింది.

ఎటువంటి ఆసరాలేనివారికి పింఛన్ల ద్వారా వచ్చేఅరకొర సొమ్మే దిక్కు, దాన్నికూడా ఈ ముఖ్యమంత్రి దిగ మింగాలని చూడటం బాధాకరం. పింఛన్లపెంపుపై గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా మాటతప్పాడు. 2004 కు ముందు ఎన్నికలప్రచారంలో రూ.75గా ఉన్న పింఛన్ ని రూ.200లకు పెంచుతాననిచెప్పిన రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రయ్యాక కేవలం రూ.25పెంచి, పింఛన్ రూ.100కే పరిమితం చేశాడు.

ఆనాడు తండ్రి 25రూపాయలు పెంచితే, నేడు కొడుకు రూ.250 మాత్రమే పెంచి పింఛన్ దారుల నోట్లోమట్టికొట్టాడు. మాటతప్పను మడమతిప్పనని చెప్పకునే తండ్రీకొడుకులిద్దరూ మూకుమ్మడిగా ప్రభుత్వమిచ్చే పింఛన్లసొమ్ముపై బతికేవారిని దారుణంగా వంచించారు.

2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంచేసిన వెంటనే చంద్రబాబునాయుడు రూ.100ల పింఛన్ ని రూ.1000కి, ఆతరువాత అనతికాలంలోనే రూ.2వేలకు పెం చాడు. అదీ చంద్రబాబునాయుడి గారి ఘనత.

జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోనెం 174, ప్రత్యేకంగా పింఛన్లు ఎగ్గొ ట్టడానికే తీసుకొచ్చినట్లుగా ఉంది. దానిలోఉన్న నిబంధనలు అలా ఉన్నాయి. విద్యుత్ వాడకం 300యూనిట్లు దాటినా, గ్రామాల్లో నివసించే వారి ఆదాయం రూ.10వేలు దాటినా, పట్టణాల్లోని వారి ఆదాయం నెలకు రూ.12వేలు దాటినా, ఆఇంట్లోని వారికి పింఛన్ రాదని జీవోలో పేర్కొన్నారు. ఇంతకంటే దారుణం మరోటి ఉంటుందా?

విద్వేషం, వినాశనం, విధ్వంసాల కలయిక జగన్మోహన్ రెడ్డి అనడంలో ఇసుమంతైనా సందేహంలేదు. అధికారంలోకిరాగానే ప్రజావేదికను కూల్చేశాడు. ఆ విధంగా విధ్వసంతోనే పరిపాలన ప్రారంభించాడు.

ఉదయం లేచిన దగ్గర్నుంచి తెలుగుదేశంనేతలు, కార్యకర్తలపై విద్వేషం తో రగిలిపోతున్నాడు. పోలీసుల సాయంతో తప్పుడుకేసుల పెడుతూ, వారిని అకారణంగా జైళ్లకుపంపుతున్నాడు. తనపిచ్చిచేష్టలు, నిర్ణయా లతో రాష్ట్రాన్ని వినాశనం చేశాడు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థి తికి రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. సీపీఎస్ హామీని తుంగలో తొక్కాడు. జగన్మోహన్ రెడ్డి అంతిమంగా రాష్ట్రానికి దుర్దశను, ప్రజలకు దురావస్థలను మిగిల్చాడు.

(నాయుడు విలేకరుల సమావేశం విశేషాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *