హుసేన్ సాగర్ లో నిమజ్జనం ఒకె, ఈ ఏడాది మాత్రమే: సుప్రీంకోర్టు

హుస్సేన్ సాగర్ లో ఈ ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్సవాలనిర్వాహకులు ఊరట లభించింది.

అయితే  ఇలాంటి నిమజ్జనానికి  ఇదే చివరి అవకాశం (one last time this year) అని కోర్టు స్పష్టం  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను పరిశీలించింది. అంతేకాదు, ఈ సారి అనుమతిస్తున్న నిమజ్జనం నామమాత్రమే (symbolic) అని, నీళ్లలోకి వదలిన విగ్రహాలను వెంటనే తొలగించాలని ధర్మాసనం తెలిపింది.

ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది.

“In view of the undertaking given by the learned Solicitor General that in future the State would not allow immersion of the idols in the Hussain Sagar lake, as a last chance, we permit immersion of idols in the said Lake only for this year. However, we make it clear that we have not interfered in the rest of the directions issued by the High Court and the State of Telangana is directed to submit a compliance report in respect of those directions before the High Court, for the said Court to hear the matter further and pass appropriate orders thereon,” అని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.

ఉత్సవాలు జరుగుతున్న సమయంలో   విగ్రహాల నిమజ్జనాన్ని  నిషేధిస్తూ  హైదరాబాద్  హై కోర్ట్ కు (ప్రధాన న్యాయమూర్తి ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ టి వినోద్ కుమార్ ల ధర్మాసనం)  ఉత్తర్వులిచ్చిందని  రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన  విగ్రహాలు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయని, అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు జారీ చేసి వాటిని హుసేన్సాగర్ లో నిమజ్జంన చేయవద్దని చెబితే అనేక ఇబ్బందులు వస్తాయని ఆయన వాదించారు.

కాని, ఇది ప్రతి సంవత్సరం వస్తున్న ఇబ్బందేనని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అందువల్ల ప్రభుత్వ ప్రత్యామ్నాయం ఆలోచించాలన ఇదే చివరి అవకాశమని చెప్పారు. దీనికి స్పందిస్తూ   వచ్చే ఏడాది ఈ ఆర్డర్ ను అమలు చేస్తామని తెలిపిన మెహతా తెలిపారు.

‘ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్ లు ఏర్పాటు చేశామని, కాలుష్యం జరగకుండా వెంటనే  వెంటనే సాగర్ లో నిమజ్జనమయిన విగ్రహాలను తరలించడం జరుగుతుంది,’ అని మెహతా చెప్పారు.

’హైదరాబాద్ వినాయక నిమజ్జనం ఇబ్బందులు నాకు తెలుసు.  హుస్సేన్ సాగర్ పరిశుభ్ర పరిచేందుకు ప్రతి ఏడాది నిధులు ఖర్చు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం విగ్రహాలను నిమజ్జనం చేయడం ద్వారా నిధులు వృధా అవ్వడం లేదా,‘ అని  ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.

‘22 చిన్న పాండ్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. కానీ అందులో పెద్ద పెద్ద విగ్రహాలు నిమజ్జనం సాధ్యం కాదు,’ అని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వాదనతోధర్మాసనం ఏకీభవించలేదు.

హైదదరాబాద్ కు చెందిన న్యాయవాది మామిడి వేణుమాధవ్ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ తో  ఈ హుసేన్ సాగర్ లో నిమజ్జనం చేయరాదనే విషయం చర్చనీయాంశం అయింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన గణేష, దుర్గామాత విగ్రహాలను  నిమజ్జనం చేయరాదని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘిస్తున్నదని వేణుమాధవ్ పిటిషన్ లో పేర్కొన్నారు. దీని మీదే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఇలాంటి విగ్రహాల నిమజ్జనం నిలిపివేసింది. నిమజ్జనం ఎలా నిర్వహించాలని పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

హైకోర్టు ఉత్తర్వుల మీద తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *