టిటిడి బోర్డు ఎలా ఉండకూడదో ఆలా ఉందా?… జగన్ కు చెడ్డ పేరు తెస్తుందా?

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)

చరిత్రలో మంచి సాంప్రదాయానికి ప్రతినిధి కావడం చాలా కష్టం – చెడుకు ఉదాహరణగా మిగలడం అంతే సులభం.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ వ్యవస్థలో జరిగే నిర్ణయాలను ప్రజలు నిశితంగా గమనిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిటిడి బోర్డును నియమించినది.

సభ్యులు , కోఆప్షన్ , ఆహ్వానితులతో కలిపి 79 మంది అవుతున్నారు. ప్రభుత్వం బోర్డు 24 మంది ఆహ్వానితులు మిగిలిన వారు అని వేరు వేరుగా ఆదేశాలు జారీ చేసినంత మాత్రాన ఎవరు విశ్వసించరు.

ఎందుకంటే సభ్యులకు , ఆహ్వానితులకు వ్యత్యాసం కేవలం ఓటు హక్కు ఉండదు. అయిన ప్రభుత్వం తన సభ్యులను నియమించిన తర్వాత ప్రతిపక్ష సభ్యులు విభేదించడం , వ్యతిరేకంగా ఓటు వేయడం అనేది ఉంటుందా ?

టిటిడిలో ఒక మంచి నిర్ణయం చేస్తే అమితమైన మంచి పేరు వస్తుంది. అందుకు భిన్నంగా జరిగితే అంతకంటే ఎక్కువ నష్టం కూడా వస్తుంది.

సున్నితమైన టిటిడిలో మంచి ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి అంటే విజయనగర రాజులు , అన్నమయ్య చారిత్రక సంపదను భావితరాలకు అందించిన ఆంగ్లేయులు , అనేక సంస్కరణలకు కారణం అయిన నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వం గుర్తుకొస్తుంది.

చైర్మన్ నియామక చర్చ జరిగినప్పుడు ఆకెపాటి చెంగల్ రెడ్డి గుర్తుకొస్తారు. కార్యనిర్వహణాధికారి చర్చ జరిగినప్పుడు అన్నారవు గారు గుర్తుకు వస్తారు. బహుశా ఇకపై బోర్డు నియామకం చర్చ వస్తే ఇలాంటి బోర్డు ఉండకుండా ఉంటే బాగుంటుందని చర్చకు నేటి నియామకం ఉదాహరణగా మిగిలిపోతుంది. ఇంతటి సార్వజనీన అసంతృప్తి ( బోర్డులో సభ్యత్వం పొందిన వారు కూడా సంతోషంగా లేకపోవడం ) 1200 వందల సంవత్సరాల లిఖిత చరిత్రలో , దాదాపు 90 సంవత్సరాల బోర్డు చరిత్రలో ఏ నిర్ణయంతో కూడా వచ్చి ఉండదు.

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, తిరుపతి యాక్టివస్టు)

One thought on “టిటిడి బోర్డు ఎలా ఉండకూడదో ఆలా ఉందా?… జగన్ కు చెడ్డ పేరు తెస్తుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *