ఈ అమెరికా ట్రాజెడీకి 20 యేళ్లు… (నాటి తొలి వీడియోలు)

2001 సెప్టెంబర్ 11 అమెరికా మీద అల్ ఖేదా దాడి దాడి

చేసింది.ప్రపంచంలో ప్రజలకు  ఆమెరిక చేసిన దాడుల గురించే తెలుసు. అమెరికా మీద దాడుల చాలా తక్కువ. చెప్పుకుంటే పర్ల్ హార్బర్ దాడి (డిసెంబర్ 7,1941)  గురించెే చెప్పుకోవాలి. అప్పటి నుంచే చరిత్ర నిండా అమెరికా చేసిన దాడులు, యుద్ధాలే కనిపిస్తాయి. తొలిసారి అమెరికా మీద అప్రకటిత యుద్ధం లో  అల్ ఖేదా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ దాడి చేసి అమెరికా అహంభావాన్ని గాయపర్చింది.

అప్పటినుంచి అమెరికా ఎన్నో యుద్ధాలుచేసింది మొన్న ఆగస్టు 15 దాకా. దాని కొనసాగింపే ఆప్గనిస్తాన్ లో సైనిక జోక్యం.  అయితే, చివరకు ఈ యుద్ధంలో అమెరికా ఓడిపోయి, పారిపోయిందని ప్రపంచమంతా కోడై కూస్తోంది. అమెరికా మీద యుద్ధం గురించిన ఇరవైయేళ్ల చిన్న జ్ఞాపకం ఇది. ఇందులో సందేశం ఉంది. ఆరాటూ ఉంది.

ప్రంపచాన్ని యుద్ధాలు, కక్షలు కార్పణ్యాలు, అణ్వయుధాలు లేని శాంతియుత  సహాజీవనం వైపు ఈ జ్ఞాపకం నడిపించాలన్నదే సందేశం, ప్రపంచ ప్రజల ఆరాటం.

ఆ రోజు ఉదయం 19 మంది అల్ ఖేదా(al-Qaeda) టెర్రరిస్టులు, నాలుగు అమెరికా కమర్షియల్ విమానాలను హైజాక్ చేశారు.   వరల్డ్ ట్రేడ్ సెంటర్ (WTC) ట్విన్ టవర్స్ మీదకు రెండు విమానాలతో ఢీకొట్టించారు. మూడో విమానం పెంటగన్ (Pentagan) మీద దాడి చేసింది. నాలుగో విమానం లక్ష్యం ఏమిటో ఎవరికీ తెలియదు అయితే, అందులోని ప్రయాణికులు తిరగబడ్డారు. దీనితో హైజాకర్ పైలట్  ఈ విమానాన్ని పెన్సిల్వేనియా పొలాల్లో కూల్చేశాడు.

ఆరోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అల్ ఖేదా దాడిలో కూలిపోవడంతో సుమారు 3000 మంది చనిపోయారు.అమెరికా భూభాగం మీద పరాయి దేశస్థులు జరిపిన దాడిలో ఇంత పెద్ద ఎత్తున ఎపుడూ పౌరులు చనిపోలేదు.అమెరికా మీద ఒక దేశం అదే భూభాగం మీద  యుద్ధ దాడి జరిపడం ఆదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఎందుకంటే, అమెరికా యుద్ధాలన్నీ ప్రపంచమంతా చేసింది తప్ప, తన భూభాగం మీదకు యుద్ధాన్నెపుడూ రానీయలేదు.

నార్త్ టవర్ మీద దాడి

ఉదయం 8.46 సమయంలో అయిదుగురు హైజాకర్లు  అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫైట్11 ని  వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒకటో టవర్ (North Tower) లోని 93-99 అంతస్థుల మధ్య ఢీ కొట్టారు. అపుడు ఆ విమానంలో 76 మందిప్రయానణికులు, 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు.వాళ్లంతా  చనిపోయారు. ఈ దాడిలో టవర్ మెట్ల మార్గం కూలిపోయింది. దానితో 91 వ అంతస్థు పైనున్న అన్ని అంతస్థుల్లో ప్రజల్లు చిక్కుకుపోయారు.

 

 

కూలిపోతున్న నార్త్ టవర్

సౌత్ టవర్ మీద దాడి

మరొక ఐదు మంది హైజాకర్లు  యునైటెడ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 175 ని హైజాక్ చేశారు. ఈ విమానం  వరల్డ్ ట్రేడ్ సెంటర్ రెండో టవర్ (South Tower)  లోని 77-85 అంతస్థుల  మధ్య ఢీకొట్టింది.  విమానంలోని 51 మందిప్రయాణికులు 9  మంది విమాన సిబ్బంది దాడిలో చనిపోయారు. ఈ దాడితో మెట్ల మార్గం మూసుకుపోయింది. లిఫ్ట్ ల వైర్లన్నీ తెగిపోెయాయి.  దీనిలో  ప్రజలంతా ఈ అంతస్తుల్లో చిక్కుకుపోయారు. లిఫ్ట్ లలో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయారు.

 రెండు దాడుల మధ్య గడువులో టవర్లను ఖాళీచేయించే ప్రయత్నం జరిగింది. అలా కొంతమంది బతికిబయటపడ్డారు. రాలేని వారంతా చనిపోయారు.

 

 

కూలిపోతున్న సౌత్ టవర్ 

 

 

(video source: 9/11memorial)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *