మళ్లీ తెరచుకున్న ఏడుపాయల ఆలయం

మంజీరా నది నీటి ఉధృతి తగ్గడం వల్ల ఈ రోజు (10.9.21) శ్రీఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. దానితో అమ్మారికి  అభిషేకం హారతి పూజలు నిర్వహించడం జరిగింది.

 

ఇటీవల కురిసిన వర్షాల ఆలయం పక్కనే పారుతున్న నదికి వరదలొచ్చాయి.దీనితో ఆలయం మూసేశారు. అయితే, ఆలయం వెలుపల ఉన్న ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి, హారతి పడుతూ వచ్చారు. ఈ రోజు ఉదయం కూడా అదే జరిగింది.

రాజగోపురంలోని ఉత్సవ విగ్రహానికి అలంకరణ

 

ఎడుపాయలు వన దుర్గ భవాని ఆలయాన్ని 12 వ శతాబ్దంలో నిర్మించారని చెబుతారు.

ఏడుపాయలు గుడి (credit: edupayala vanadurga temple)

 

ఇది కనకదుర్గా దేవికి అంకితం చేయబడింది. పచ్చని అడవిలో గుహలో  సహజ రాతి నిర్మాణాల మధ్య ఉన్న సుందరమైన మందిరం ఇది. ఈ ప్రదేశం దగ్గిర మంజీరా నదిలోకి ఏడు పాయలుగా చీలిపోతున్నందున ఆ ఆలయానికి ఏడుపాయలు అనే పేరు వచ్చింది. తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలనుంచి కూడా  పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకువస్తుంటారు. వరంగల్ టూరిజం డిపార్ట్ మెంట్ సమాచారం ప్రకారం ఏటా 30 లక్షల మంది భక్తులను ఏడుపాయలను సందర్శిస్తుంటారు.  శివరాత్రి సందర్భంగా ఇక్కడ అయిదురోజుల జాతర జరుగుతుంది. ఏడుపాయలు హైదరాబాద్ కు 90 కిమీ దూరాన మెదక్ జిల్లాలో  ఉంటుంది. రోడ్డుమార్గన ఈ క్షేత్రాన సులభంగా చేరుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *