-నల్లెల్ల రాజయ్య
ఈ రోజు తెలంగాణ వీరనారి,విస్నూరు దొరను గడగడలాడించి వాని గుండెల్లో గుబులు రేపిన చాకలి (చిట్యాల)ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పద్మాక్షమ్మ గుట్ట వాకర్స్ అధ్వర్యంలో పద్మాక్షి గుండం కట్టపై అయిలమ్మ చిత్రపటానికి తెలంగాణ పుష్పమైన తంగేడు పూలతో అల్లిన దండను వేసి ఘనంగా నివాళులర్పించటం జరిగింది.
ఈ నివాళి కార్యక్రమంలో ఆకుల దుర్గయ్య,అంబటి కుమారస్వామి,ఉడతనబోయిన పాపయ్య,వెంకటేశ్ ,నల్లెల్ల రాజయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాకర్స్ అసోషియేషన్ ముఖ్య సలహాదారుడు అంబటి కుమార స్వామి మాట్లాడుతూ తన భూమి కోసం,జనమందరి విముక్తి కోసం సాహసోపేతంగా విస్నూరు రామచంద్రారెడ్డితో పోరాడి గెలిచిన తెగువ గల మహిళ చాకలి అయిలమ్మ మహిళలందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయిందన్నారు.
దొర తన భర్తను, కొడుకులను జైళ్ళో బంధించినా భయపడక
న్యాయస్థానం ద్వార గెలుపొంది పోరాట వారసత్వాన్ని నేటి బాలబాలికలకు తెలిసే విధంగా అన్ని తరగతుల విద్యార్థులకు తప్పని సరి పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టి పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి
విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
నేటి సమాజంలో పాలకులు దొరలను, నిజాం రజాకార్లను మించిన అతి కిరాతక పాలన కొనసాగిస్తూ ప్రజాస్వామిక గొంతుకలను నిర్భంధాల పాల్జేస్తున్న అప్రజాస్వామిక వాతావరణంలో నాటి అయిలమ్మ తెగువను, ఆశయాలను ,స్పూర్తిని కొనసాగించి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవలసిన బాధ్యత తెలంగాణ పౌరులందరి పై ఉన్నదని ఆ దిశగా ఉద్యమం కొనసాగించాలని ప్రశ్నించాలని,వాకర్స్ అసోషియేషన్ కో-ఆర్డినేటర్ నల్లెల్ల రాజయ్య పిలుపునిచ్చారు.