డ్రగ్స్ విచారణ సెన్సేషనల్ గా కాదు, సెన్సిబుల్ గా ఉండాలి!

డ్రగ్స్ మాఫియా పై ED తీవ్రంగా సినీప్రముఖులపై విచారణ మంచిపబ్లిసిటి తో రక్తి కట్టిస్తున్నారు .అసలు డ్రగ్స్ తయారీదారులు పట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేశారు .
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దుచేస్తూ ” 1) దేశసరిహద్దులలో టెర్రరిస్టుల ఆగడాలను అరి కట్టడం 2) డ్రగ్స్ మాఫియాను అణిచివేయడం 3- ఎన్నికలలో నల్లదనం ఎరులై పారడాన్ని ఆపడం కర్తవ్యంగా ప్రకటించుకున్నారు. ఈ మూడు ముహమ్మారులను అరికట్టడమే నల్లదనం పై దాడి అని ఎంత గొప్పగ ప్రకటించారో మరి యిప్పుడు ఆలక్ష్యం సాదించబడిందా?? టెర్రరిస్టులు, డ్రగ్స్ మాఫియా, ఎన్నికలలో ధన ప్రవాహం నియంత్రించడానికి నోట్ల రద్దు అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు .

గతం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వినియోగించిన వారిపై సిట్ దర్యాప్తునకు ఆదేశించి, విచారించిన రిపోర్టు బుట్ట దాఖలు అయిందన్నారు.

ఇప్పటి విచారణతంతుకూడా కళాకారులను ఏడిపించేదిగా వుంది తప్పా అసలు మాఫియాను పట్టుకునేదిగా కనపడడం లేదు.

అసలు డ్రగ్స్ తయారు కాకపోతే సరఫరా చేశేవాడుంటాడా?బ్తినేవాడుంటాడా ??

సెన్సేషనల్ విచారణకన్నా సెన్సిబుల్ విచారణ అవసరం .
డ్రగ్ మూలస్తంబాలపై గురిపెట్టమని కోరుతున్నాను

(డాక్టర్ కె.నారాయణ, సిపిఐ జాతీయ కార్యదర్శి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *