గణేశ్ విగ్రహాలు తయారు చేసే కళాకారుని ఆవేదన

కర్నూలు జిల్లా అదోని పట్టణములో వినాయకుని విగ్రహాలు తయారు చేసే ఒక కళాకారుని ఆవేదన. ఆయన వలస కార్మికుడు.  ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడ విగ్రహాలు తయారుచేయడం మొదలుపెట్టాడు.  వినాయక ఉత్సవాలు జోరుగా సాగతాయని ఉన్నదంతా ఊడ్చి విగ్రహాలను ఆరునెలలుగా తయారుచేసి కూర్చున్నాడు. ఆశ అడియాస అయింది.  అయితే, ఆంధ్రప్రదేశ్ బహిరంగ ఉత్సవాలను నిషేధించారు.దీనితో విగ్రహాలను కొనేవాడులేకుండా పోయాడు. ఆయన పెట్టుబడి మట్టిపాలయింది. కరోనా కట్టడి తర్వాత ఇచ్చినతొలి వినాయక చవితి. ఈసారి తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గాయి. కరోనా ఆంక్షలు తగ్గించారు. పాఠశాలలు తెరిచారు. బార్లు, వైన్ షాపులుపనిచేస్తున్నాయి. అందువల్ల వినాయకచవితి ఉత్సవాలు కూడా యధావిధిగా సాగుతాయని భావించాడు. అయితే, ప్రభుత్వం ఈ ఉత్సవాలను నిషేధించింది.  అతగాడు ఇపుడు తిండికి అల్లాడుతున్నాడు.

నమస్తే సారు,
మమ్ములను ఆదుకోండి…..
ఊరు కాని ఊరు..

వచ్చి రాని భాష, ఇళ్ళు వాకిలి వదిలి, పొట్ట తిప్పలు కోసం ఇక్కడి వచ్చినాము సారు…

మాకు ఈ పని తప్ప వేరే పని రాదు సారు…
మేము మా చేతి కళను నమ్మి జీవించే వాళ్ళము సారు….

సూమరు అరు నెలల నుంచి నిద్రాహారాలు మాని ఈ విగ్రహలు తయారు చేశాము సారు…

నేను మా భార్య పిల్లలు తిండి తిప్పలు పాడి విగ్రహలకు రంగులు వేశాము సారు…

లక్షల పెట్టుబడి దేవుని మీద భారంతో అదిక వడ్డీ అని లెక్క చేయకుండా తెచ్చుకుని మరీ తయారు చేశాము సారు…

వినాయక చవితి ఇంకా వరం రోజులు ఉంది అనే సమయంలో ఇలాంటి వార్త వస్తుంది అని ఊహించుకోలేదు సారు…

వచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి తీసుకుపోతున్నరు సారు….
ఈ విఁగహలు అమ్ముడుపోక పోతే నేను నా కుటుంబం రోడ్డున పడవలసిన ఉంటుంది సారు…

ఎలాగైనా మాకు న్యాయం చేయండి సారు…
సారు చివరిగా ఒక్క విషయం సారు మీరు రోజుకు మూడు పుటలు కడుపు నింపుకుంటున్నరు.. అనుకుంటా…. సారు..

” ఆయన తన కడుపులో ఉన్న భాద ఒక సారిగా కన్నీళ్లతో ”

ఓ సారు నేను నా భార్య పిల్లలకు కనీసం ఒక్క పూట అయినా కడుపు నిండా అన్నం పెట్టలేక పోతున్నా… సారు

అన్ని ఉత్సవాలు పండుగ లాగానే ఈ పండుగ కూడా బాగా జరుగుతుంది అని నమ్మకంతో లచ్చల పెట్టుబడి అప్పుతో తేచ్చి తయారు చేశాము సారు….

ఇప్పుడు మా పరిస్థితి కుక్కలు చింపిన ఇస్తాకుల మారిపోయింది….సారు
సారు మీరు ఎవరో మాకు తెలియదు కానీ మాకు న్యాయం చేయండి సారు.

(ఆంధ్రప్రదేశ్ లో వినాయక ఉత్సవాలకు అనుమతి లేదు.ప్రభుత్వం బహిరంగ ఉత్సవాల మీద ఆంక్షలు విధించింది. దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తున్నది.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *