ప్రైవేట్ స్కూళ్ల కష్టాలు ప్రజలు వినాలంట…

Bad Time అంటే ఇదే…

ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చాయి. ఈ సందర్భన్గా వారు చెప్పుకోబోయే కష్టాలు, నష్టాలకు మీడియా కవరేజి ఇవ్వాలని పాత్రికేయులకు సాదరంగా ఆహ్వానాలు పలికాయి…

మీ ఆహ్వానాన్ని మన్నించే ముందు మాదొక మాట. . .

గత కొన్నేళ్లుగా జర్నలిస్టు పిల్లలకు 50శాతం రాయితీ తో ప్రయివేటు విద్య అందించమని ప్రభుత్వం తరుపున జిల్లా కలక్టర్ లు, డి.ఇ.ఓ లు చాలా మెమోలు, లేఖ లు వ్రాసారు.

మరికొంత మంది అధికార్లు ఫోన్ లు కూడా చేసి చెప్పారు.
అప్పుడు మీరు ఎమన్నారో ఒకసారి గుర్తు చేస్తా… ఓపిగ్గా వినండి.

“మా స్కూల్ లో సీట్ లు ఖాళీ లేవండి. . . సారీ.. అధికార్ల కు ఏం పోయింది సార్.. అలానే లెటర్ లు ఇస్తారు.. ఇక్కడ ఫీజులు లేకుండా చెప్పడానికి, ఉంచడానికి ఇదేమన్నా ధర్మసత్రమా. జర్నలిస్టుల పిల్లలయితే చేర్చుకోవద్దని మా మేనేజ్మెంట్ చెప్పారు అండి… సారీ సార్..

“ఇప్పటికే మేం చాలా మంది పేద పిల్లలకు సీట్లు ఇచ్చాం. వేరే స్కూల్ లో ట్రై చేయండి సార్. . .

“మా చైర్మెన్ గారికి చెప్పాం అండి. ఆయన ఏమీ అనలేదు. ఫుల్ ఫీజు కట్టేయండి. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. . .

“జర్నలిస్టు ల పిల్లలకు ఎందుకు సార్ 50శాతం రాయితీ.  అంతగా చదివించుకునే అవకాశంలేకపోతే గవర్నమెంట్ స్కూల్ కు పంపేసుకోండి. . మాకేమన్నా డబ్బులు చెట్లకు కాస్తున్నాయా.

“మా స్కూల్ చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుందండి. పైగా సెంట్రల్ సిలబస్. మాకు స్టేట్ ఆఫీసర్ ల లెటర్ లు పనిచేయవు.”

ఇవేగా మీరు చెప్పిన కుంటి సాకులు. ఇప్పుడు మీకు ఈ బడుగు జర్నలిస్టులే ఉడతా సాయం చేయాలి. లేదంటే మీ కష్టం, నష్టం చెప్పుకున్నా సమాజం లో ఎక్కువ శాతంమందికి చేరదు. ప్రజల్లో మీ పట్ల సానుభూతి రాదు. ప్రభుత్వానికి మీ పట్ల కనికరం కలగకపోవచ్చు.
ప్రయివేటు స్కూల్స్ పెద్ద ఉపాధి రంగం అనే సానుభూతి మాకు ఉంది.
కానీ, యాజమాన్యాలు పెద్ద దోపిడీ దొంగలు అనే చెడ్డ అభిప్రాయమూ ఉంది.
బ్యాడ్ టైం అంటే ఇదే.
బెటర్ లక్ నెక్స్ట్ టైం. . .

-ఇట్లు జర్నలిస్ట్ మిత్రులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *