‘ధరలకు వ్యతిరేకంగా నిరసన తెలపడం నేరమెట్లా అవుతుంది?’

పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసన చెప్పడం నేరమెట్లా అవుతందని తెలుగు దేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య అంటున్నారు.

దేశంలో పెరుగుతున్న ఇంధనం ధరల మీద నిరసన చెప్పడంఅనేది కనీసం పౌర హక్కు.  ఆంధ్రలో ఇది కనుమరుగయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయమం మానవ హక్కుల ఉల్లంఘన,  ఇలా చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని   ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్ కు  లేఖ రాశారు.

లేఖలోని వివరాలు:

* ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ (టిడిపి) 28 ఆగష్టు 2021 న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.

* లీటరు పెట్రోల్‌ రూ.108 లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యధిక ధరను కలిగి ఉంది.

* పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కోవిడ్ నిబంధనలను అనుసరించి నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేపట్టడం జరిగింది.

* కానీ, అధికార వైసీపీ పార్టీ పోలీసు బలగాలను మోహరించి టిడిపి నాయకులను, కార్యకర్తలను, సాధారణ ప్రజలనునిర్దాక్షిణ్యంగా అరెస్టు చేశారు.

* కొంతమందిని గృహ నిర్బంధంలో ఉంచారు. * ప్రజలు తమ అసమ్మతిని శాంతియుతంగా వ్యక్తం చేయకుండా బెదిరించేందుకు అనేకమందిపై కేసులు నమోదు చేయబడ్డాయి.

* చాలా చోట్ల వివిధ సెక్షన్ల కింద తప్పుడు కేసులు నమోదు చేయడమే కాకుండా చట్టవిరుద్ధంగా అరెస్టులు చేసి అక్రమంగా నిర్బంధించారు.

* రాజ్యాంగాన్ని పాటించకుండా, ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘింస్తూ పోలీసులు ప్రదర్శనకారులను చట్టవిరుద్ధంగా నిర్బంధించారు.

* ఏ విధమైన కోవిడ్ నిభందనలు పాటించని అధికార వైయస్‌ఆర్‌సిపి నాయకులు నిర్వహించే జన సమ్మేళనాలు, ఊరేగింపులు, సమావేశాలపై పొలీసులు తీవ్రంగా నిర్లక్ష్యం చేసారు.

* వైఎస్ఆర్‌సిపి నేతృత్వంలోని ప్రభుత్వం టిడిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని వారిని బాధితులుగా చేసేందుకు కోవిడ్ మహమ్మారిని సాకుగా ఉపయోగిస్తోంది.

* దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) విచారణ జరిపి కేసులను నమోదు చేయడానికి బాధ్యులైన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి .

* ఎన్‌హెచ్‌ఆర్‌సి సత్వరం చర్య తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులను పునరుద్ధరించి ఆర్టికల్ 19 ను కాపాడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *