ఎవరతను?

సేను సెలకల్లో చీడపీడలు
పురుగుల మందతడు,
సమాజం లో కలుపుమొక్కలను
ఏరివేయాలకునే
కలుపు మందు అతడు,
ఎండిడొక్కలకు పెరుగన్నమతడు
రైతుకు నుదిటి స్వేధాన్ని తుడిచే తుండుగుడ్డతడు
వడ్డుగెనాలను నరికే సలికెపారతడు
ఓనమాలు నేర్వని జనాలసేతిలో సుద్దముక్కనే అతడు
కార్మిక కర్షక బండిరుసుకు
నల్లని ధారల కందెనతడు
గడపలుదాటని బడుగుల
గుడిసెల గుండెల్లో మ్రోగే సవ్వడి అతడు,
గల్లీ నుండి ఢిల్లీ వరకు
రైతుల ఉద్యమంతో
మమేకమైన
మట్టి మనిషి అతడు,
అతడు రైతు,
అతడు రైతులకు,
రైతాంగ ఉద్యమ
నాయకుడు,

-జక్కుల వెంకటయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *