కేంద్ర ప్రభుత్వం అమ్మేసి పండగ చేసుకోవాలనుకుంటున్న జాతి ఆస్తుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పోరాడిన తెచ్చుకున్న ప్టాంటను ఆమ్మేసి తీరతామని, ఈ నిర్ణయం లో మార్పులేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెగెసి చెప్పారు. ఆమె పేరుకు తెలుగు వాళ్లకోడని పేరుగాని, తెలుగు వాళ్ల ఆత్మగౌరవానికి ఆమె ఆవగింజంత కూడా చేసింది లేదు. ఎందుకంటే, ఆంధ్రా బ్యాంక్ ను యూనియన్ బ్యాంక్ ో లో విలీనం చేసి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆమె దెబ్బతీసింది.నిజానికి విలీనమయిన తర్వాత పుట్టిన బ్యాంకులో ఆంధ్ర అని పేరు పెట్టాల్సి ఉండింది. నిర్మలా సీతారామన్ కి అలాంటి సెంటిమెంట్ లేదుకదా?
ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ ను డాక్టర్ బోగరాజు పట్టాభి సీతారాామయ్య సాతంత్య్రోద్యమం లో భాగంగా ఏర్పాటుచేశారు. ఆంధ్ర బ్యాంక్ ఏర్పాటు తెలుగునాటి సాగిన జాతీయోద్యమంలో ఒక ఘట్టం. ఇలాంటి బ్యాంకు ఉనికిలేకుండా చేయడమంటే జాతీయోద్యమం నాటి తెలుగు ఆనవాళ్లను చెరిపేయడమే.
ఇపుడవిశాఖ ఉక్కును అమ్మేస్తామంటున్నారు. విశాఖ ఉక్కు ఉద్యమం తెలుగు నాట జాతీయోద్యమ స్థాయిలో సాగిన పోరాటం. దీనికి తెలుగువాళ్లు ప్రాణాలు పణంగా పెట్టారు. విశాఖ ఉక్కువెనక త్యాగాలున్నాయి.
అయితే, దీనిని అమ్మెందునకు ఆమెపూనుకున్నారు.
ఇపుడు విషయమేంటంటే, ఈ విశాఖకు (RINL)కు కొత్త చెయిర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ను నియమించారు. ఆయన పేరు అతుల్ భట్. 2024 నవంబర్ దాకా ఈపదవిలో ఉంటారు.
ఎన్నికలయ్యే లోపు విశాఖ స్టీల్ ను అమ్మేస్తారనే వార్త వినపడుతూ ఉంది. ఆ పని పూర్తి చేసేందుకే అతుల్ భట్ ను తీసుకొస్తున్నారనే వాదన కూడా ఉంది.