వార్తలకు మతం మసి పూస్తారా? : చీఫ్ జస్టిస్ రమణ ఆందోళన

వార్తలకు మతం రంగుపులమడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో  న్యూఢిల్లీ నిజాముదీన్ లో  తబ్లిగి జమాత్  జరిపిన సమావేశం మీద దాఖలయిన పిటిషన్లను విచారిస్తూ ఆయన సోషల్ మీడియా వింతపోకడల మీద ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాతో కొన్ని ఆన్ లైన్ పోర్టల్స్ కూడా వార్తలకు మతం రంగు పులుము తున్నాయని ఆయన పేర్కొన్నారు.

వీళ్లు నియంత్రించేందుకు నియమాలు లేవు. సోషల్ మీడియా కంపెనీలో కేవలం పెద్దవాళ్ల మాటలనే వింటూంటాయి. వాటికి సామాన్య ప్రజలు, ప్రభుత్వసంస్థలు (institution) అంటే లెక్కేలేదని వ్యాఖ్యానించారు.

“Twitter, Facebook or Youtube, they never respond to us and there is no accountability. About the institutions they have they have written badly and they don’t respond and say this is their right. They only worry about powerful men and not judges, institutions, or common men. That is what we have seen,” అని ఆయన వ్యాఖ్యానించారు.

యుట్యూట్ వంటి శక్తి వంతమయిన మాద్యమాల ను నియంత్రించే చట్టాలేమయినా ఉన్నాయా అని ఆయన ప్రభుత్వాన్నిఅడిగారు.

“If you go to youtube, so much is shown in one minute. You can see so how much fake news there is. Web portals are not governed by anything. There is an attempt to give communal color to news and that is a problem, Ultimately it brings bad name to the country,” జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు.

సాలిసిటర్ జనరల్  తుషార్ మెహతా కూడా ఏకీభవిస్తూ,  మతం రంగు పులమడమే కాదు, బోగస్ వార్త(fake news)ని కూడా ప్రచారం చేస్తున్నాయని అన్నారు. అసలు ఈపరిస్థితిని ఎదుర్కొనేందుకే  కేంద్రం ఐటిరూల్స్ ను రూపొందించిందని అన్నారు. ఇలాంటి ఐటిరూల్స్ మీద అనేక హైకోర్టులలో పిటిషన్లు వేశారని, వాటన్నింటినిసుప్రీంకోర్టు కుబదిలీ చేయాల్సిన అవసరం ఉందని తుషార్ మెహతా అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *