ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ రాజీనామా

తాను ఈనాడు దినపత్రికకు రాజీనామా చేసినట్లు కార్టూనిస్టు శ్రీధర్ ప్రకటించారు.

క్లుప్తంగా ఈ విషయాన్ని ఆయన ఫేస్ బుక్ వాల్ మీద రాశారు.

ఈనాడులో నాలుగు దశాబ్దాలు  పూర్తయ్యాయని చెబుతూ తాను పత్రికకు రాజీనామా చేసినట్లు చెప్పారు.

ఈనాడు కు శ్రీధర్ కార్టూన్ గుండెకాయలాగా పనిచేసింది. ఈనాడుపేపర్ చేతికందగానే కింద పాకెట్ కార్టూన్ మీదకు లేదా మెయిన్ కార్టూన్ మీద కళ్లు జరజరా పాకుతూ పోతాయి. తెలుగు నేల మీద చాలా మంది గొప్ప గొప్ప  కార్టూనిస్టులున్నారు,  అందులో కొందరు మేధావులు కూడా ఉన్నారు, సైద్ధాంతిక నిబద్ధత కలవాళ్లూ ఉన్నారు.అయితే,   శ్రీధర్ కార్టూన్ సామాన్యులకు సులభంగా అర్థమయిన కొంటెగీత.  అందుకే ఈనాడు =శ్రీధర్ కార్టూన్ అనే పరిస్తితి వచ్చింది.

కారణమేదయినా సరే, ఈనాడు నుంచి శ్రీధర్ కార్టూన్ మాయం కావడం పత్రికలకు తీరని లోటు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *