చార్ మినార్ భాగ్యలక్ష్మి గుడి బిజెపి నిప్పురవ్వ అవుతుందా?

భారతీయ జనతా పార్టీ రాజకీయాలు హైదరాబాద్ పాత బస్తీ నుంచి మొదలవుతున్నాయి. ఈ పార్టీ పాతబస్తీ చార్ మినార్ పక్కనే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని కేంద్రం చేసుకుని రాజకీయ తుఫాన్ సృష్టించాలనుకుంటున్నది.
తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ గ్లోబల్ ఇమేజ్ ని హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టిన అమెజాన్ వంటి సంస్థలను చూపించి రాజకీయాలను నడపాలనుకుంటుంటే, భారతీయ జనతా పార్టీ పాత బస్తీ నుంచి ‘హైదరాబాద్ విముక్తి’ అంటూ రాజకీయాలు నడపాలనుకుంటూ ఉంది.

ఇందులో భాగంగా ఈ రోజు బిజెపి చరిత్రలో కనివిని ఎరుగనంత పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి  భాగ్యలక్ష్మి గుడి దగ్గిర బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నిజానికి, ఒక చారిత్రక కట్టడం దగ్గిర ఇంత పెద్ద సభకు,జనసమీకరణకు అనుమతి నీయవచ్చా? అయితే, ఇపుడున్న పరిస్థితుల్లో బిజెపిని ఈ ప్రభుత్వం సంస్థ కాదనలేదేమో.

భాగ్యలక్ష్మి గుండి సందర్శించిన కేంద్ర హోం మంతి అమిత్ షా
ఈ ఉద్దేశంతోనే మొన్న జిహెచ్ ఎంసి ఎన్నికల సమయంలో యూనియన్ హోంమత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చినపుడు మొదట చేసిన పని భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించడం.   బిజెపి విజయానికి పూజులు చేసిన తర్వాతే  ఆయన విలేకరులతో   క్యాంపెయిన్  గురించి మాట్లాడారు.  అమిత్ షా చేసిన భాగ్యలక్ష్మి ఆలయ పూజులు ఫలించాయని, అందుకే పార్టీ హైదరాబాద్ లో టిఆర్ ఎస్ కు అడ్డు కట్ట వేసిందని బిజెపి బలంగా నమ్ముతున్నది. దీనితో బిజెపి రాజకీయాల్లో  ఈ గుడి ప్రాముఖ్యం పెరిగింది. ఈ స్ఫూర్తితో ఇక టిఆర్ ఎస్ ను హైదరాబాద్ నుంచి తరిమేయడమేనని ఘంటాపథంగా చెబుతున్నారు.
 చార్ మినార్ పక్కన వెలసిన తాత్కాలిక ఆలయం బాగ్యలక్ష్మి ఆలయం. ఎపుడు వెలసిందో ఎలా వెలిసిందో గాని, ఈ ఆలయాన్ని తొలగించే శక్తి ఎవరికీ లేదు. దీని వల్ల హైదరాబాద్ కు చిహ్నంగా ఉంటుతున్న పురాతన కట్టడం చార్ మినార్  కు ముప్పు అని తెలిసినా ఆర్కియాలజీ డిపార్ట్ మెంటు అధికారులు  భాగ్యలక్ష్మి ఆలయం మీద ఎలాంటి ఆంక్షలు విధించడం లేదు. నిజానికి పురాతన కట్టడాల పరిధిలో ఉన్నాయని చాాలా వీధులను నోటిఫై చేసి అక్కడ కట్టడాలను నిషేధించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న దష్టాంతాలెన్నో ఉన్నాయి.  అయితే, చిత్రంగా ఈ చిన్న గుడి ఇంతవరకు పెద్ద సమస్య  రాజకీయ సమస్యగాని, లా అండ్ అర్దర్ సమ్యగాని కాలేదు.
జిహెచ్ ఎంసి ఎన్నికల తర్వాత ఈ గుడి ప్రాత మారబోతున్నది. ఇది బిజెపికి కొత్త ఇన్ స్పిరేషన్ కాబోతున్నది.
ఏవిధంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమర వీరుల స్థూపం         టిఆర్ ఎస్ కు  సెంటిమెంటల్  గా ఎలా ఉపయోగపడిందో బిజెపి కి ఇపుడు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం  ఒక సెంటిమెంట్ ఆయుధం కాబోతున్నది.
భాగ్యలక్ష్మి గుడిలో బండి సంజయ్, రాజాసింగ్ పూజలు
 దీనికి సాక్ష్యం  మొన్న అమిత్ షా హుటాహుటిన ఈ ఆలయాన్ని సందర్శించి పూజులు చేసి ఆశీస్సులు పొందడమే. నిజానికి ఇంతకంటే ముఖ్యమయిన ఆలయాలు చాలా ఉన్నాయి. వాటికి వెళ్లకుండా ఆయన చార్ మినార్ దగ్గిరకే వచ్చారు. వచ్చేముందు ఇక్కడ  ప్రజలెవరూ లేకుండా ఖాలీ చేయించారు.  పెద్ద ఎత్తున  పోలీసులను మొహరించారు. ఇతర ఆలయాలకు, ఈ ఆలయానికి తేడా రెండుముక్కలో ఇదీ. 1. ఇది ముస్లిం ఏరియాలో ఉండటం.  2. ఇది పూర్తిగా బిజెపి ఆలయం. అందుకే ఈ గుడిని సందర్శించడంలో బిజెపి రాజకీయ ప్రయేజనం ఉంది. ఇది గుడి సందర్శనలో  భక్తి కంటే రాజకీయమే ఎక్కువగా ఉంటుంది.
కార్పొరేటర్ల ప్రమాణం
ఈ రోజు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈ గుడి సందర్శించారు. మొన్న ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్ల తో పాటు గోషా మహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా వున్నారు. తెలంగాణలో బిజెపి జైత్రయాత్ర విజయవంతం  కావాలని వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ జైత్ర యాత్రకు సహకరిస్తామని కార్పొరేటర్లంతా ప్రమాణం చేశారు.
అందువల్ల  బిజెపి రాజకీయాల్లో ఈ గుడి ఒక నిప్పురవ్వకానుంది.అయితే, అది ఆరిపోతుందా, భగ్గున మండుతుందా ముందు ముందు తేలుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *